కాకినాడ, ఏప్రిల్ 25 (way2newstv.com)
తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండల పరిధిలోని అంకంపాలెం శివారు పాటిచెరువు గ్రామంలో కొండచిలువ హల్ చల్ చేసింది. ప్రధాన పంట కాలం మూసివేయడంతో గ్రామస్తులు కొందరు చేపలు పట్టేందుకు వేటకు వెళ్లారు. సుమారు 15 అడుగులు పొడవు గల కొండచిలువ గ్రామస్తులకు కంటపడింది. దీంతో చేపలు పట్టే వారు కంగారుపడి పరుగులు తీశారు. సుమారు రెండు గంటలపాటు ప్రజలు భయాందోళనకు గురిచేసింది.
కొండచిలువ హల్ చల్
రైతులు తమ పంట పొలాల వద్ద ఉన్న పశువులను కోళ్లను గ్రామాల్లోకి తరలించుకుపోయారు. ఈ విషయం గ్రామస్తులు తెలియడంతో పంట కాలవ వద్దకు పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. యువకులు చేపలు పట్టే వలవేసి కొండ చలువను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే కొండచిలువ మెల్లగా పంట కాలవ పైకి రావడంతో కోళ్లను కప్పిపెట్టి బుట్టలోవేసి కొండచిలువను యువకులు బంధించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. బంధించిన కొండచిలువను వన్యప్రాణి అటవీ శాఖ అధికారులకు అప్పగిస్తామని గ్రామస్తులు తెలిపారు.