రహదారి ఉల్లంఘనులకు ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రహదారి ఉల్లంఘనులకు ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలు

గుంటూరులో 50 మందికి వినూత్న శిక్ష విధించిన జెసి శుక్లా 
గుంటూరు ఏప్రిల్ 25 (way2newstv.com
రహదారి భద్రతకు సంబంధించి వారంతా తప్పులు చేసారు. కానీ ఇప్పడు వారే అలా చేయటం సరికాదంటూ రోడ్డేక్కారు. ఇది ఏలా సాధ్యం అనుకుంటున్నారా... గుంటూరు జిల్లా సంయిక్త కలెక్టర్, జిల్లా అదనపు న్యాయమూర్తి హిమాన్హు శుక్లా సమాజ హితం కాంక్షిస్తూ చేపట్టిన చర్యల ఫలితమే ఈ మార్పు. ప్రత్యేకించి రహదారి భద్రతకు పెద్దపీట వేస్తున్న శుక్లా నియమాల ఉల్లంఘనులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వారిలో మార్పును ఆకాంక్షిస్తూ సరికొత్త వరవడికి శ్రీకారం చుట్టగా దాని కొనసాగింపుగానే తాజా కార్యక్రమానికి గుంటూరు పట్టణం వేదికైంది.  మునుపెన్నడూ లేనివిధంగా బహుశా రాష్ట్రంలోనే తొలిసారిగా జెసి సామాజిక సేవను దండన రూపంలో విధిస్తున్నారు.  అది ఏరూపంలోనైనా ఉండవచ్చంటున్నారు. భోజన పధకంలో వడ్డన, ఆసుపత్రులలో సేవకుడు,  ట్రాఫిక్ పోలీస్కు సహాయకారి, ప్రార్ధనా మందిరాలను పరిశుభ్రం చేయటం, రహదారులను పరిశుభ్రం చేయటం, వయోవృద్ధులకు సహాయకులుగా ఉండటం, స్వఛ్చ ఆంధ్రప్రదేశ్లో సేవలు ఇలా ఏ దండన అయినా కావచ్చు. కాకుంటే అది సామాజిక సేవతో ముడిపడి ఉండేలా శుక్లా చర్యలు చేపట్టారు. 


ఫోన్ల ట్యాపింగ్ ఫై అఫిడవిట్ దాఖలు చేయండి

ఈ నేపధ్యంలోనే బుధవారం సాయంత్రం 50 మంది ఉల్లంఘనులకు నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను అప్పగించారు. వీరందరినీ కలెక్టరేట్ మొదలు గుంటూరు నగరంలోని పలు కూడళ్లలో ట్రాఫిక్ విధులు నిర్వహింపచేసారు.  పోలీసుల సహకారంతో ట్రాఫిక్ విధులు చేపట్టగా, సగటు వాహన చోదకులు దీనిని ఆసక్తిగా గమనించారు. ఫలితంగా ఈ పరిణామం ఇతర వాహనచోదకులకు ఒక సందేశంగా మారగా, వారిని సైతం ఆలోచించచేసింది. ఈ పరిణామం నగరంలోని వాహన చోదకులలో చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి గుంటూరు జిల్లాలో 2018 క్యాలెండర్ ఇయర్లో 1992 ప్రమాదాలు జరగగా, ఈ సంఘటనలలో  947 మంది మృత్యువాత పడ్డారు. 2019 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలల్లో 199 ప్రమాదాలు జరగగా, 72 మంది మరణించారు. 192 మంది గాయపడ్డారు. 2018లో కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి 71,975 కేసులు నమోదు అయ్యాయి. రోడ్డు ప్రమాదాలలో నిత్యం పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. కొన్ని సందర్భాలలో ఎవరికి వారే కారణం కావచ్చు. మరి కొన్ని సందర్భాలలో ఎవరో చేసిన తప్పులకు ఇంకెవ్వరో నష్టపోతున్నారు. కేవలం అతి వేగం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించటం వల్లే ఈ సమస్యలు ఎదురవుతున్నాయి. జరిమానా, డ్రైవింగ్ లైసెన్సు రద్దు వంటి కఠిన  నిర్ణయాలు సైతం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఈ నేపధ్యంలో తన న్యాయాధికారాలకు పదును పెట్టిన శుక్లా రహదారి భధ్రత నియమాలను పక్కన పెట్టి ద్విచక్ర వాహనం నడుపుతూ సెల్ఫోన్ మాట్లాడుతున్న మంగళగిరివాసి నాగసతీష్కు గతంలోనే సామాజిక సేవను దండనగా విధించారు. మూడురోజుల పాటు మధ్యాహ్న భోజన పధకం అమలులో సహాయకారిగా ఉండాలని ఆదేశించి, అమలు చేయించారు. ఈ నేపధ్యంలో హిమాన్షు శుక్లా మాట్లాడుతూ ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపటం పెరిగిందని, అది వారితో పాటు రోడ్డుపై వెళుతున్న ఇతర చోదకులకు కూడా నష్టం తెస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు.  కేవలం నేటి యువతలో మార్పు కోసమే ఈ తరహా విధానాన్ని ఎంచుకున్నామని, సామాజిక సమస్యగా పరిణమిస్తున్న రహదారి నియమాల ఉల్లంఘనకు సామాజిక సేవే సరైన సమాధానం చెబుతుందని భావిస్తున్నామన్నారు. సామాజిక వేత్తలు, ప్రజాప్రతినిధులు  ప్రమాద రహిత సమాజం కోసం తమవంతు సహకారం అందించాలని విన్నవించారు. నిబంధనలను పాటించాలని ఎన్నో సందర్భాలలో ఇటు రవాణా శాఖ, అటు పోలీసు శాఖ అవగాహనా సదస్సులు నిర్వహించినా వారిలో మార్పు రావటం లేదన్నారు.  కార్యక్రమంలో డిటిసి రాజరత్నం , ఎంవిఐలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.