హైదరాబాద్, ఏప్రిల్ 22 (way2newstv.in)
రాజకీయ నాయకులు ఈ రోజుల్లో ఏదైనా వార్తను ఖండిస్తే ఆ ఖండనకు విలువ లేకుండా పోయింది. అందుకే నేను పార్టీ మారుతున్నాను అనే ప్రచారం పైన ఖండన చేయాలనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీలు ఉత్తమ్, భట్టి తప్ప మిగతా అందరి మీద పార్టీ మారతారు అని ప్రచారం జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోమవారం అయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు కూడా తెరాస లోకి వెళ్లాలనుకోవడం లేదు, నేను స్వయంగా తెరాస లోకు వెళ్ళాలి అనేది ప్రయత్నం చేయడం లేదు. హరీష్ రావు ఒక మంత్రిగా చేసిన తప్పిదాలు ఎప్పటికి అప్పుడు నేను ప్రశ్నించాను. మెడికల్ కాలేజ్ , మంజీర నీటి విషయం లో సంగారెడ్డి ప్రజలకు హరీష్ రావు చేసిన అన్యాయాన్ని నేను ప్రశ్నించాను.
నేను మారను..మారను
నేను హరీష్ రావు పై చేసే వ్యాఖ్యలకు కేటీఆర్ కు,కేసీఆర్ సంబంధం లేదు ఇందులో వారి పాత్ర లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లతో మా పీసీసీ ప్రెసిడెంట్, భట్టి మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు పార్టీ మారకుండా. అందుకే నేను పార్టీ మారతానా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. ప్రజలకు, రైతులకు సమస్యలు ఉన్నంత కాలం రాజకీయ వ్యవస్థకు దొకా లేదు. రాజకీయం కేవలం సమస్యలపై హామీలు ఇస్తూ కాలం గడుపుతున్నారు. ప్రజలకోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆలోచించే రాజకీయ వ్యవస్థ ఇప్పుడు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వీడిన ఎమ్మెల్యేలు మళ్ళి కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడం తప్పు. కాంగ్రెస్ పార్టీలో నుండి ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్లినా పార్టీకి నష్టం లేదు, కాంగ్రెస్ పార్టీ కి కార్యకర్తలే బలం. కాంగ్రెస్ పార్టీ మర్రి చెట్టు లాంటిది. ఇంటర్ విద్యార్థులు, విద్యార్థినిలు చాలా సున్నితంగా ఉంటారు. మధ్యతరగతి కుటుంబ విద్యార్థుల మార్కుల్లో జరిగిన అవకతవకలపై చాలా మానసిక వేదనకు గురి అయ్యారు. ఇంటర్ బోర్డ్ లో జరిగిన అవకతవకలపై సంబంధిత పై అధికారులపై సీఎం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇంటర్ బోర్డ్ లో జరిగిన తప్పిదాలు వెంటనే పరిష్కారంచాలి,విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాని అన్నారు.