వరంగల్ అర్బన్,ఏప్రిల్,20, (way2newstv.com):.
ప్రజోపయోగ పనులనిమిత్తం ప్రభుత్వం కేటాయించిన భూములను కాపాడుకోవాల్సిన భాద్యత ఆయా శాఖలపై ఉన్నదని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె.పాటిల్ తెలిపారు. అమ్మవారి పేట లో రూ.66 కోట్ల అంచనా వ్యయంతో ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్ధ నిర్మించనున్న 220 కెవి సబ్ స్టేషన్ పనులకు కేటాయించిన భూమిని సంబంధిత అధికారులతో కలసి అయన శనివారం పరిశీలించారు.
భూములను కాపాడుకోవాలి
వేగంగా విస్తరిస్తున్న నగర ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలోవుంచుకుని ఈ సబ్ స్టేషన్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ భూమికి ప్రహారి గోడను వెంటనే నిర్మించుకోవాలని ఆదేశించారు. మట్టి తవ్వకానికి తీసిన గోతులను నింపుకుని వినియోగించుకోవాలని చెప్పారు. ఎందుకు పనికిరాని భూములను మాత్రమే ఇటువంటి నిర్మాణానికి ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు. అన్ని రకాలుగ అనువైన భూములను ఇతర అవసరాలకు ఉపయెగించనున్నట్లు చెప్పారు. ఈ పర్యటనలో ఆర్ డి వో కె.వెంకారెడ్డి, తహాశీల్ధార్ నాగేశ్వరావు విద్యుత్ శాఖాధికారి పాల్గొన్నారు.