మద్దికెర ఏప్రిల్ 24 (way2newstv.com)
పల్లెజీవం పథకంలో భాగంగా బుధవారం రోజున ఘనంగా రైతు దినోత్సవం కార్యక్రమంను నిర్వహించారు.శ్రీ రంగనాథస్వామి రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో రైతుబడి దినోత్సవం జరిగింది. జీవనేలలు గుర్తించడం,దాని ప్రాముఖ్యత గురించి తెలియజేయడం,రైతులు భూసార పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టే విధానం గురించి నవయూత్ అసోసియేషన్ వ్యవసాయ సమన్వయ కర్త అయిన డి.హుస్సేనయ్య తెలియజేసారు.
పల్లెజీవం పథకంలో భాగంగా ఘనంగా రైతుబడి దినోత్సవం
భూసారం పెంచేందుకు చెరువు మట్టిని తొలుకోవడం,గొర్రెలమందలను పొలాల్లో ఆపడం,బయోమాస్ మొక్కలు పెంచడంతో పాటు,చిరుధాన్యపు పంటలు వేసుకునేలా ప్రణాళికలు చేసుకొని రైతు ఉత్పత్తి దారుల సంఘము ఆధ్వర్యంలో పనులు చేపట్టడం జరుగుతుందని నవయూత్ అసోసియేషన్ టీం లీడర్ నరసింహులు తెలియజేశారు.అలాగే వ్యవసాయ అద్దె కేంద్రం నుండి వ్యవసాయ పరికరాలను రైతులు వినియోగించుకోవాలని తెలియజేసారు.ఈ రైతు దినోత్సవంలో సంఘం చైర్మన్ డి.తిమ్మప్ప,బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నరసింహాగౌడ్,రామాంజనేయులు,హసన్ వలి, నవయూత్ సంస్థ సిబ్బంది భానోదయ్,మురళి, రంగముని,సంఘం సిబ్బంది చంద్రమోహన్,శివ, కమ్యూనిటీ ఆర్గనైజర్లు సుంకన్న,రేణుక, రవికుమార్ మరియు బసినేపల్లి,పెరవలి మరియు హంప గ్రామాల నుండి రైతులు,మహిళలు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.