హైదరాబాద్ ఏప్రిల్ 5 (way2newstv.com):
నిజామాబాద్ జిల్లాకు చెందిన కీలక నాయకుడు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే టీఆర్‌ఎస్‌లో చేరుతానని మండవ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని మండవ వెంకటేశ్వరరావు నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకుని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
టీఆర్‌ఎస్ లోకి మండవ వెంకటేశ్వరరావు
సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు మండవ వెల్లడించారు. ఇవాళ ఉదయం మండవ వెంకటేశ్వరరావును టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, పువ్వాడ అజయ్ కలిశారు. మండవ వెంకటేశ్వరరావు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు హయాంలో ఆయన మంత్రిగా కూడా పని చేశారు.