30న విజయవాడలో సియం ప్రమాణ స్వీకారోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు- సిఎస్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

30న విజయవాడలో సియం ప్రమాణ స్వీకారోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు- సిఎస్


అమరావతి, మే 25  (way2newstv.com)
ఈనెల 30వతేదీ ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైయస్.జగన్మోహన రెడ్డి,మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నందున అందుకు తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. ఈమేరకు సియం ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లపై శనివారం అమరావతి సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సిఎస్ సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సజావుగా జరిగేందుకు వీలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈకార్యక్రమ ఏర్పాట్లను ప్రోటోకాల్ విభాగంతోపాటు, కృష్ణా జిల్లా కలక్టర్,విజయవాడ పోలీస్ కమీషనర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిఎస్ ఆదేశించారు.ఈకార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు,ప్రజాప్రతినిధులు,అధికారులు,ప్రజలు ఇతర ఆహ్వానితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా చూడాలని ఏర్పాట్లు విషయంలో ఎంతమాత్రం రాజీపడవద్దని స్పష్టం చేశారు.ట్రాఫిక్ సమస్య రాకుండా తగిన వాహనాల పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక సైనేజి బోర్డులన ఏర్పాటు చేయాలని చెప్పారు.


30న విజయవాడలో సియం ప్రమాణ స్వీకారోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు- సిఎస్
పార్కింగ్ ప్రాంతాల నుండి ఇందిరాగాంధీ స్టేడియం వరకూ ప్రత్యేక బస్సులు ద్వారా ప్రజలను తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని సిఎస్ చెప్పారు.ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనే వారిందరికీ తగిన తాగనీరు,స్నాక్స్ వారు కూర్చున్న చోటే అందించే ఏర్పాట్లు చేయాలన్నారు.అదేవిధంగా ప్రస్తుత వేసవి దృష్ట్యా స్టేడియంలో ఎసిలు,కూలర్లు ఏర్పాటు చేయాలని సిఎస్ ఆదేశించారు.స్టేడియంలోపల,వెలుపల,ఇతర పబ్లిక్ ప్రాంతాలు,కూడళ్లలో ప్రత్యేక ఎల్ఇడి తెరలను ఏర్పాటు చేసి ప్రజలందరూ ప్రమాణ స్వీకార కార్యక్రమానిక తిలకించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు.స్టేడియంలో ప్రవేశించే మార్గాలు,నిష్క్రమించే మార్గాలను సక్రమంగా నిర్దేచించి ప్రజలు సులభంగా ఈకార్యక్రమానికి వచ్చి తిరిగి వారి గమ్యస్థానాలకు సవ్యంగా చేరుకునేల తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈకార్యక్రమానికి రాష్ట్రేతర ప్రాంతాల నుండి ఎంతమంది వివిఐపిలు, విఐపిలు వస్తారనేది రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆప్రకారం వారికి తగిన ఏర్పాట్లు చేయాలని ప్రోటోకాల్ విభాగ అధికారులను సిఎస్ ఆదేశించారు.అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే గవర్నర్ ఇతర ప్రముఖులకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.వేదికకు సంబంధించిన బ్యాక్ డ్రాప్,పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వంటి ఏర్పాట్లు సక్రమంగా చేయాలని సమాచారశాఖ కమీషనర్ ను ఆయన ఆదేశించారు.అలాగే స్టేడియం వద్ద తగిన బారికేడింగ్ తదిర ఏర్పాట్లు చేయాలని ఆర్అండ్బి అధికారులను ఆదేశించారు. పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్పి ఠాకూర్ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడ కుండా తగిన ట్రాఫిక్ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ మాట్లాడుతూ ఈప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే ఎంఐపిలు,వివిఐపి,విఐపిలు,మీడియా తదతర 5రకాల కేటగిరీ పాస్ లను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.కృష్టా జిల్లా కలక్టర్ మహ్మద్ ఇంతియాజ్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 35వేల మంది కూర్చునే వీలుందని అయితే వేదిక,ఇతర ఏర్పాట్లు మూలంగా 25వేల వరకూ స్టేడియంలోకి అనుమతించి మరో 10వేల మంది వరకూ స్టేడియం వెలుపల ప్రత్యేక ఎల్ఇడి తెరల ద్వారా తిలకించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు.విజయవాడ పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమల రావు మట్లాడుతూ ప్రమాణ స్వీకారానికి వచ్చే విఐపిల వాహనాలకు స్టేడియంకు ఎదురుగా గల ఎఆర్ గ్రౌండ్ లోను,ఇతర వాహనాలకు పిడబ్ల్యుడి గ్రౌండ్,బిషప్ అజరయ్య పాఠశాల గ్రౌండ్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.అలాగే ఏలూరు వైపు నుండి వచ్చే వాహనాలకు రామవరప్పాడు సమీపంలోను,హైదరాబాదు వైపు నుండి వచ్చే వాహనాలకు గొలపూడి సమీపంలోను,మచిలీపట్నం వైపు నుండి వచ్చే వాహనాలకు కానూరు సమీపంలోను, గుంటూరు వైపు నుండు వచ్చే వాహనాలకు కాజ టోల్ గేటు సమీపంలోను పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.