తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఉదయం ఫోన్ చేశారు. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలని చంద్రబాబును జగన్ ఆహ్వానించారు. ఏపీ అభివృద్ధికి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని బాబుకు జగన్ విజ్ఞప్తి చేశారు.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి చంద్రబాబుకు జగన్ ఆహ్వానం
ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12:23 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనుంది. ఇక తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ను జగన్ ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైసీపీ 151, టీడీపీ 23, జనసేన 1 స్థానంలో గెలిచింది.