ఎమ్మిగనూరు మే 16 (way2newstv.com)
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ఎస్డీపీఐ ఆఫీస్ దగ్గర పాపులర్ ఫ్రంట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టేట్ ఇమామ్ ప్రెసిడెంట్ మౌలానా యూసుఫ్ సాబ్, గవర్నమెంట్ ఖాజీ అతావుల్లా, ఎమ్మిగనూరు పాపులర్ ఫ్రంట్ డివిజన్ ప్రెసిడెంట్ ఆఫీస్ జహీర్ అహ్మద్, సుల్తాన్ మస్జిద్ ముతవల్లి మహబూబ్ బాషా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీళ్లు మాట్లాడుతూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రజలకు సేవ చేయడంలో ఎల్లప్పుడు ముందంజ లో ఉంటుందని తెలియజేశారు.
పాపులర్ ఫ్రంట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఇఫ్తార్ కిట్ పంపిణీ
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కొన్ని సంవత్సరాలుగా చలో స్కూల్, రంజాన్ కిట్టు, ఇఫ్తార్ కిట్, అంటూ ఇలా ఎన్నో కార్యక్రమంలో పేదలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన సంస్థ, గతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కాపాడిన ఘనత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలకే చెందుతుందని తెలియజేశారు. దేశంలో పేదరికం అనే మాటను నిర్మూలించడమే తమ లక్ష్యం అంటూ తెలియజేశారు, ప్రతి ఒక్క ముస్లిం మహిళలకు ఇఫ్తార్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి చికెన్ మా భాషా, జాకీర్, సలాం, ఇతర పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
News