తెలంగాణలో మూడు రోడ్డు ప్రమాదాలు..ఇద్దరు మృతి


హైదరాబాద్ మే 21  (way2newstv.com)
తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు జిల్లాలో మంగళవారం మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.  మహబూబ్ నగర్ జిల్లా  జడ్చర్ల జాతీయ రహదారిపై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి. మృతుడు నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి బస్ డిపోకు చెందిన కండక్టర్ డి.అంజయ్యగా గుర్తించారు. 



తెలంగాణలో మూడు రోడ్డు ప్రమాదాలు..ఇద్దరు మృతి

మరో ప్రమాదం వరంగల్ రూరల్ జిల్లా  పరకాల, హన్మకొండ ప్రధాన రహదారిపై జరిగింది.  ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు డీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.  మూడవ ఘటన యాదాద్రి జిల్లా  పంతంగి టోల్ ప్లాజా వద్ద తెల్లవారు జామున జరిగింది. ఆగివున్న లారీని విజయవాడ బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి వస్తున్న బస్సు హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ  ఘటన రిగింది.
Previous Post Next Post