రామేశ్వరంలో హుండీ లెక్కింపు


రంగారెడ్డి, మే 21  (way2newstv.com)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూఖ్ నగర్ మండలంలోని రామేశ్వర దేవాలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఆదివారం రాత్రి  ఈ  దేవాలయంలో  గుర్తుతెలియని దొంగలు  నాలుగు హుండీలను ధ్వంసం చేసి.. ఎత్తుకెళ్లి డబ్బులు, కానుకలు దోచుకున్న విషయం ప్రజలకు విదితమే. తాజాగా సీసీ కెమెరాల ఫూటేజి బయటకు రావడంతో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేసారు. 



రామేశ్వరంలో హుండీ లెక్కింపు 

మంగళవారం కొందూర్గు దేవాదాయ శాఖ కార్యనిర్వాహణ అధికారి  నరేందర్ పర్యవేక్షణలో స్థానిక కార్యనిర్వహణ అధికారి, సర్పంచ్ సంపత్ , చైర్మన్ ప్రభాకర్ తదితరుల ఆధ్వర్యంలో ప్రధాన హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ దేవాలయంలో వున్న  ఐదు హుండీలలో  నాలుగు హుండీలని దొంగలు దోచుకున్నారు.  మిగిలిన ప్రధాన హుండీని లెక్కించారు. 
Previous Post Next Post