ప్రజాభీష్టం, ప్రజాతీర్పు స్పష్టంగా ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జగన్మాత భద్రకాళి ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని కోరుతూ వరంగల్ జిల్లా హన్మకొండలోని విష్ణు గార్డెన్స్ లో శనివారం బిజెపి ఆద్వర్యం లో లో ‘రాజ శ్యామల మహా యాగం’ నిర్వహించడం జరిగింది.
మోడికి జగన్మాత ఆశీస్సుల కోసం బిజెపి ‘రాజ శ్యామల మహా యాగం’
నరేంద్ర మోదీ మొదటి పర్యాయం జనరంజక పాలన అందించినప్పటికీ ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేక ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చిన నేపథ్యంలో రెండవ పర్యాయమూ అధికారంలోకి రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దేవత ఆశీస్సులతో ప్రకృతి సైతం సహకరించాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది.లోకకల్యాణం, దేశాభివృద్ధితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు ‘చంద్ర గ్రహణం’ వీడాలని.. తెలంగాణలో జనరంజక ప్రజాపాలన రావాలని.. భారతీయ జనతా పార్టీ మరింత విస్తరించాలని కోరుతూ ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డా. కె.లక్ష్మన్ ఈ యాగంలో పాల్గొన్నారు. వందలాదిగా భక్తులు తరలివచ్చి పూర్ణాహుతితో యాగం పూర్తి చేసుకుని, భక్తిశ్రద్ధలతో తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ పవిత్ర యాగంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Tags:
telangananews