మునిసిపల్ భేటీలో వాకౌట్లు


తాడేపల్లిగూడెం మే 31, (way2newstv.com)
పశ్చిమగోదావరి జిల్లా .తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభసగా మారింది. వైస్ చైర్మన్ మారిశెట్టి సుబ్బారావు చైర్మన్ స్థానంలో కౌన్సిల్ మీటింగ్ కు హాజరైయారు.  కొత్త ఫ్లైఓవర్ అప్రోచ్ రోడ్డు లోని బ్రాందీ షాపు వద్ద గల ప్రభుత్వ భూమిలో అక్రమ భవన నిర్మాణం విషయంలో  అధికారులపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏ అనుమతులూ లేకుండా ప్రభుత్వ భూమిలో  రెండంతస్థుల భవనం నిర్మాణం చేస్తుంటే అధికారులు చూస్తూ ఎలా ఊరుకున్నారంటూ నిలదీసారు. 


మునిసిపల్ భేటీలో వాకౌట్లు
ఈ విషయంలో కౌన్సిల్ లోని సభ్యులు, అధికారులు లక్షల్లో సొమ్ములు దండుకుని అక్రమ నిర్మాణానికి సహకరించారంటూ కౌన్సిలర్లు  ఆరోనించారు. తక్షణమే అక్రమ భవనాన్ని కూల్చివేయాలంటూ డిమాండ్ చేసారు.  అక్రమ భవన నిర్మాణం  కూల్చివేతకు రమ్మని కోరినా అధికారులు స్పందించకపోవడంపై 16 మంది కౌన్సిలర్ల వాకౌట్  చేసారు. కౌన్సిల్ హాల్ ఎదుట ఆందోళనకు దిగిన కౌన్సిలర్లు, చైర్మన్ డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేసారు. తరువాత పదహారు మంది కౌన్సిలర్లు అక్రమ భవన నిర్మాణం వద్దకు వెళ్లి పరిశీలించారు. 
Previous Post Next Post