న్యూ ఢిల్లీ మార్చి 27, (way2newstv.com)
వైకాపా, బీజేపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలవగానే అధికారులను ఎలా బదిలీ చేస్తారు. ఫిర్యాదులు అందితే విచారణ లేకుండానే బదిలీ చేస్తారా తెదేపా ఎంపి సీఎం రమేష్ ప్రశ్నించారు. బుధవారం అయన మీడియతో మాట్లాడారు. ఈసీని కలిసి అధికారుల బదిలీపై వివరణ కోరుతాం. దీనిపై న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించామని అన్నారు. ఇంటిలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావుపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా బదిలీ చేశారు.
దేశ చరిత్రలో ఇంటిలిజెన్స్ డీజీ ని ఈసీ మార్చిన చరిత్ర లేదు. ఎలాంటి ఆరోపణలు లేకుండా కడప ఎస్పీ ని మార్చారు. ఒక ముఖ్యమైన కేసులో కడప ఎస్పీ విచారణ జరుగుతుంటే ఇలా బదిలీ చేస్తారా అని ప్రశ్నించారు.
విచారణ లేకుండానే బదిలీ
వివేకానంద కూతురు పారదర్శకంగా విచారణ కావాలని అన్నారు. కానీ ఆ తర్వాత ఒక్కో చోట ఒక్కో రీతిలో మాట్లాడుతున్నారు. కడపలో వివేకానంద హత్య కేసు విచారణలో కీలక విషయాలు బయటికి వస్తాయనే బదిలీ జరిగింది. వివేకానంద హత్య జరిగింది వాళ్ల ఇంట్లో. రక్తపు మరకలు తుడిచింది వాళ్ళు. కత్తిపోట్లను గుండెపోటు గా చిత్రీకరించింది కూడా వాళ్లే. ఈ డ్రామాలన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈసీ కి ఫిర్యాదు అందితే ఎలాంటి విచారణ లేకుండా బదిలీ ఎలా చేస్తారు గతంలో జగన్ కు ఓటేస్తే ఏపీ స్కాం ఆంధ్ర అవుతుందన్న మోదీ.. ఇప్పుడు జగన్ కేసుల గురించి మాట్లాడట్లేదు. దీన్ని బట్టి చూస్తే వైసీపీ, బీజేపీ ఒప్పందం అర్థం అవుతుంది. బీజేపీ, వైసీపీ, టీఆరెస్ కుమ్మక్కు అయ్యాయని అనుకున్నాం. ఇప్పుడు ఈ జాబితాలో ఈసీ కూడా చేరిందని అయన వ్యాఖ్యానించారు.