తిరుమల, మే 7, (way2newstv.com)
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం రోజురోజకు ఉజ్వలంగా ప్రకాశిస్తోంది. తిరుమల తర్వాత అంతటి ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయం సహా అనేక స్థానిక ఆలయాలున్నా.. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య బాగా పెరుగుతోంది. రోజుకు 40 వేల మందికిపైగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అందుకే తితిదే కూడా తిరుచానూరు అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. తిరుమల తరహాలో తిరుచానూరును తీర్చిదిద్దడానికి కృషి చేస్తోంది. భక్తుల సౌకర్యం కోసం పీఏసి నిర్మిస్తోంది. అన్న ప్రసాద వితరణ కేంద్రం కొత్తగా నిర్మిస్తోంది. రోడ్లను అందంగా తీర్చిదిద్దుతోంది. ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తోంది. తిరుచానూరు పంచాయతీ ముందుకు వస్తే గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు ఇస్తామని టీటీడీ ప్రకటించింది. ఇలా తిరుచానూరులో కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్థి పనులు చేపట్టింది. తిరుచానూరును ఆధ్మాత్మిక పట్టణంగా తీర్చిదిద్దడం కోసం తిరుచానూరు గ్రామాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని తితిదే భావించింది. తిరుమల తరహాలో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని అనుకుంది.
నిదానంగా కొనసాగుతున్న తిరుచానూరు నిర్మణాలు
ఈ మేరకు ధర్మకర్తల మండలిలో 2013లో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దీన్ని ప్రభుత్వానికి కూడా పంపారు. ఇది జరిగితే తిరుచానూరు పాలన తితిదే అధికారుల చేతుల్లోకి వెళుతుంది. ప్రస్తుతం తిరుచానూరు జనాభా 20 వేలకు పైగానే ఉంది. తిరుచానూరుకు పోటెత్తుతున్న భక్తులకు అనుగుణంగా పంచాయతీ సదుపాయాలు కల్పించలేకపోతోంది. తితిదే తన ఇష్టమొచ్చినట్లు పనులు చేపట్టడానికి లేదు. ఏమీ చేయాలన్నా పంచాయతీ అనుమతి తప్పనిసరి అవుతుంది. పంచాయతీరాజ్ చట్టం 1984 సెక్షన్ 5(1) ప్రకారం తిరుచానూరును అనుబంధ పట్ణణంగా ప్రకటించిస్తూ గతంలో జరిగిన పాలకమండలి సమావేశంలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. తిరుచానూరు సమీపంలో 52 కోట్ల వ్యయంతో 220 గదులతో భారీ వసతి సముదాయాన్ని టిటిడి నిర్మిస్తోంది. అయితే నత్తనడకన ఇంజనీరింగ్ పనులు సాగుతున్నాయి. ఆ భవనం పూర్తవడానికి ఏడాదిపైనే పట్టనున్నట్లు తెలుస్తోంది. శ్రీవారి దర్శనార్ధం తిరుపతికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టిటిడి శ్రీనివాసం, మాధవం, విష్ణునివాస సముదాయాల్ని ఏర్పాటు చేసింది. వీటి ద్వారా సుమారు 10 వేల మంది వసతి పొందడానికి మాత్రమే వీలుంటుంది. అయితే తిరుపతికి రోజురోజుకీ యాత్రికులు, భక్తుల తాకిడీ ఎక్కువవుతోంది. టి.టి.డి. నిర్మిస్తున్న వసతి గృహాలు ఏమాత్రం సరిపోవడం లేదు .తిరుపతి వసతి గృహల నిర్మాణానికి టి.టి.డి.కి కావాల్సినంత స్థలం లేకపోవడంతో తిరుచానూరు సమీపంలో దాదాపు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని తీసుకుంది. జాతీయ రహదారికి దగ్గరగా దాదాపు 50 కోట్లకు పైగా విలువచేసే ఆభూమిలో టిటిడి నూతన భవనాన్ని నిర్మిస్తోంది. దాదాపు 52కోట్ల వ్యయంతో 7 అంత స్థులు వసతి సముదాయాన్ని నిర్మిస్తోంది. ఆ భవనంలో దాదాపు 220 గదులు, సామూ హిక వివాహాలు చేసుకోనేందుకు ప్రత్యేకంగా హాలు, దుకాణాలు, బస్టాండ్‌ను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర లోపు పూర్తి చేసేందుకు టిటిడి సమాయత్తమైనా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులు నత్తనడకన సాగుతోంది