రైఫనింగ్ ఛాంబర్ లో మామిడైతే బెటర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైఫనింగ్ ఛాంబర్ లో మామిడైతే బెటర్

విశాఖపట్టణం, మే 6, (way2newstv.com)
నగరంలో ఎక్కడ చూసినా మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. చూస్తే నోరూరేలా ఉన్నాయి. అలా అని కొని నోట్లో వేసుకుంటే పుల్లగా ఉంటున్నాయి. అంటే కాయలు సరైన విధంగా పండించకపోవడం... రసాయన వినియోగం జరిగినట్లు అర్థమైపోతుంది. మామిడి పండ్లు పూర్తిస్థాయిలో పక్వతతో పండితేనే మంచి రుచి ఉంటుంది. మామిడి పండ్లను ఎటువంటి విష పూరిత రసాయనాలు వినియోంచకుండా మగ్గబెట్టేందుకు ప్రభుత్వం రైఫనింగ్‌ చాంబర్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. అయితే ఈ చాంబర్‌ నిర్వహణలో ప్రయివేటు ఏజెన్సీకి అప్పగించారు. రైతులు మాత్రమే కాదు వ్యాపారులు కూడా తమ మామిడి పండ్లను మగ్గించుకోవచ్చు. రైఫినింగ్‌ ఛాంబర్‌లో మొదటి రోజు ఏసీ ద్వారా శీతలీకరణ చేస్తారు. తర్వాతి రోజునుంచి మూడు రోజులపాటు ఇథలిన్‌ గ్యాస్‌ను పంపించి కాయలను మగ్గిస్తారు. కాయ పండులా మారటానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. రైఫలింగ్‌ చాంబర్‌లో మామిడి కాయలను ఉంచి నాలుగు రోజుల్లో ఒకసారి (16 నిమిషాలపాటు) ఇథలిన్‌ గ్యాస్‌ను పంపిస్తారు. 4 రోజుల్లో పండు పక్వానికి వస్తుంది. ఇందుకు టన్నుకు రూ. 2 వేలు లేకుంటే రోజుకు క్రేట్‌కు రూ. 2 చొప్పున వసూలు చేస్తారు. 


రైఫనింగ్ ఛాంబర్ లో మామిడైతే బెటర్

సొంతంగా రైఫలింగ్‌ చాంబర్లను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి 40నుంచి 50 శాతం ఉద్యానవన శాఖ రాయితీ అందిస్తుందికాని వ్పాయార కోణంలో చూసుకొని రసాయనాలతో విచ్చలవిడిగా వేస్తున్నారు. ఈ తరహాలో పండించిన మామిడి పండ్లను తినడం ద్వారా జీర్ణక్రియ, క్యాన్సర్‌ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.చాలా మంది రైతులు తమ ఇళ్లలోనే ఒక గదిలో మామిడి కాయలను ఉంచి కార్బైడ్‌, అగరబత్తి పొగ ద్వారా మగ్గిస్తారు. ఈ తరహాలో మామిడి కాయలను పండుగా తయారు చేయడం వల్ల త్వరగా పండు పక్వానికి వచ్చేయడం, తక్కువ ఖర్చుతో కూడుకోవడంతో అందరూ దీనినే అనుసరిస్తున్నారు. ఈ తరహాలో పండిస్తే కనీసం 3 నెలల జైలు, రూ. లక్ష జరిమానా విధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.మామిడి సీజన్‌ ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఈ ఏడాది దిగుబడి కూడా తగ్గిపోయింది. పక్వానికి రాకముందే పంటను కోసేస్తున్నారు. వాటికి రంగు రావడం కోసం నిషేధిత మార్కెట్లో దొరికే రసాయనాలన్నీ వినియోగిస్తున్నారు. నగరంలోని సీతంపేట పరిధిలోని పళ్ల వ్యాపారి గొదాముపై దాడిచేసిన విజిలెన్స్‌ అధికారులు నిషేదిత కార్బైడ్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. గత ఏడాది మామిడి పళ్ల వ్యాపారులపై దాడులు చేయగా పళ్లను మగ్గిస్తున్న కార్బైడ్‌ను గుర్తించి సీజ్‌ చేశారు. పండ్ల వ్యాపారుల అత్యాశ.... అధికారుల ఉదాసీనత ప్రజారోగ్యానికి ముప్పు తెచ్చి పెడుతోంది. కార్బైడ్‌ దొరకని పక్షంలో చైనానుంచి దిగుమతి అయిన ఫౌడర్లు, రసాయనాలతో మామిడిన మగ్గిస్తున్నారు. దీంతో అమృత ఫలాలు కాస్తా విష ఫలాలుగా మారిపోతున్నాయి. ఏది కార్బైడ్‌తో మాగబెట్టంది, ఏది సహజంగా పండిందో తెలియని రీతిలో వీటిని వినియోగిస్తున్నారు.జిల్లాలో సుమారు 35 వేల ఎకరాల్లో మామిడి సాగవుతుంది. ఎకరాకు కనిష్టంగా అయిదు టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఉత్తరాంద్రలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పోలిస్తే చాలా తక్కువగా విశాఖ జిల్లాలో ఈ పంట సాగవుతుంది. స్థానికంగా అమ్మడంతో పాటు కొన్ని ముఖ్య కేంద్రాలనుంచి కోల్‌కతా, ఢిల్లీలకు