ఊపిరి పీల్చుకున్న కొండవాలు వాసులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఊపిరి పీల్చుకున్న కొండవాలు వాసులు

విశాఖపట్టణం, మే 6, (way2newstv.com)
స్థానిక కొండవాలు ప్రాంత ప్రజల వారికి తుపాను పేరువింటే గుండె జారిపోతుంది. ఫొనితో గుండె అరచేతిలో పెట్టుకుని దిగాలుగా ఉన్నారు. కొండవాలు ప్రాంతాల్లో నివాసంమంటే ప్రకృతితో యుద్ధం చేయడమనే చెప్పొచ్చు. కొండవాలు ప్రాంతాలైన 1, 2, 10 వార్డుల వాసులు ఆందోళన చెందుతున్నారు. హుదూద్‌ తుపాను ప్రభావానికి పదో వార్డు సత్యనారాయణ కొండపై ఉన్న ఒక ఇంటి గోడ కూలింది. దీంతో తుపాను అంటే ఈ ప్రాంతవాసులకు భయం పట్టుకుంది. కొండవాలు ప్రాంతాల్లో రక్షణ గోడలు నిర్మించకపోవడంతో తుపాను, భారీ వర్షాలు సహజంగా అక్కడి ప్రజలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. 


ఊపిరి పీల్చుకున్న కొండవాలు వాసులు

1వ వార్డు పరిధిలో సుమారు 1700 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో సుమారు 90 శాతం బంగ్లామెట్ట కొండవాలు ప్రాంతంలో నివసిస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడితే ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అక్కడున్న ప్రజలు నిత్యం భయంతో గడుపుతున్నారు. హుదూద్‌ తుపానుకు కొన్ని ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. రెండో వార్డులో 1900 కుటుంబాలు ఉండగా సుమారు 150 కుటుంబాలు గొస్తనీకి ఆనుకుని కొండపై ఇళ్లు నిర్మించుకుని ఉన్నాయి. 2015-16 కాలంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరవ్వగా అతి కష్టంమీద నిర్మాణాలు చేపట్టారు. పదో వార్డు సత్యనారాయణ కొండపై సుమారు 250 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.తుపాను అన్నా, భారీ వర్షాలు అన్న భయంగానే ఉంటుంది. కొండలపై నివాసాలు ఏర్పాటు చేసుకున్న తమ పరిస్థితి నిత్యం ఆందోళనే. హుదూద్‌ తుపానుకు ఎన్నో ఇళ్ల పై కప్పులు ఎగిరిపోయాయి. కొన్ని రోజులైతే తాగడానికి మంచినీరే దొరకలేదు. ఈ సారి అలా జరగకూడదని కోరుకుంటున్నాను.