సిద్ధాంతపరంగానే నా పోరాటం : చంద్రబాబు


విజయవాడ, మే 20 (way2newstv.com)  
సిద్ధాంతరపరంగానే మొదటినుంచి పోరాటం చేస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘నేను టెక్నాలజీలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. అదే సమయంలో టెక్నాలజీలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయి. టెక్నాలజీకి మనం మాస్టర్ కావాలే తప్ప దానికి బానిసైపోకూడదు. అందుకే దేశంలోని తొలిసారి సైబర్ సెక్యూరిటీ వింగ్ ను ఏపీలో ఏర్పాటుచేశాం. నేరాలన్నింటిని కంట్రోల్ చేస్తున్నాం’ అని చంద్రబాబు చెప్పారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం) విషయంలో తాను చేసిన పోరాటాన్ని అప్పటి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఖురేషీ గుర్తుంచుకున్నారని చంద్రబాబు తెలిపారు. ఆ విషయాన్నే నిన్న ఢిల్లీలో జరిగిన సదస్సులో ఖురేషీ ప్రస్తావించారని చెప్పారు. ‘ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చన్న ఉద్దేశంతో పేపర్ బ్యాలెట్ కు పోవాలని మేం డిమాండ్ చేశాం. కానీ ఈసీ మాత్రం మధ్యేమార్గంగా వీవీప్యాట్ లను ఎంచుకుంది. వీవీప్యాట్ ఒరిజనల్ ఐడియా ఏంటంటే ఓటు వేశాక ఎవరికి ఓటు పడిందో తెలుసుకునే స్లిప్పు ఓటర్ చేతిలోకి రావాలి. 



సిద్ధాంతపరంగానే నా పోరాటం : చంద్రబాబు

అనంతరం దాన్ని సదరు ఓటర్ బ్యాలెట్ బాక్సులో వేయాలి.కానీ ఇప్పుడు ఓటు ఎవరికి వేశామో తెలీదు, ఎవరికి పడిందో తెలీదు. ఏడు సెకండ్లు ఉండాల్సిన వీవీప్యాట్ స్లిప్పు కేవలం మూడు సెకన్లలోపే బాక్సులో పడిపోయింది’ అని చంద్రబాబు  వ్యాఖ్యానించారు. ఇప్పుడు వీవీప్యాట్ స్లిప్పును ఓటర్ సరిచూసుకుని బ్యాలెట్ బాక్సులో వేసేలా విధానం తీసుకురావాలని తాము కోరుతున్నామనీ, ఇందులో అభ్యంతరం ఏముందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇందుకోసం ప్రస్తుతమున్న పద్ధతిని మార్చాల్సిన అవసరం కూడా ఉండదని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత వస్తుందని చెప్పారు.కేథార్ నాథ్ పర్యటనకు వెళ్లడం ద్వారా ప్రధాని మోదీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇలాంటి ఘటనలపై ఈసీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీలో 89.05 శాతం పోలింగ్ నమోదయిందని వ్యాఖ్యానించారు. ఏపీలో అవసరమైనప్పుడు కేంద్ర సాయుధ బలగాలను పంపలేదని చంద్రబాబు గుర్తుచేశారు. కానీ రీపోలింగ్ సమయంలో విపరీతంగా కేంద్ర బలగాలను మోహరించారని విమర్శించారు. ఈ మోహరింపునకు ఖర్చయ్యే మొత్తం ఏపీ ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని చెప్పారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.రూ.9,000 కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన వీవీప్యాట్ యంత్రాలు అలంకార ప్రాయంగా మారాయని ఏపీ సీఎం విమర్శించారు. ‘ఫామ్-7 వ్యవహారంలో ఈసీ సహకారం అందించలేదు. ఈ ఓట్ల తొలగింపునకు ఉద్దేశించిన ఈ దరఖాస్తును ఎక్కడి నుంచి అయినా అప్ లోడ్ చేయవచ్చు. ఈ వ్యవహారంలో సిట్ ఏర్పాటు చేశామనీ, సమాచారం ఇవ్వాలని ఈసీని కోరాం. కానీ వాళ్లు స్పందించలేదు. ఐదేళ్ల పాటు ఎంతో కష్టపడి ఎన్నికలకు వచ్చాం. ఐపీ అడ్రస్ ఇవ్వకుంటే న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఈసీ నిబంధనలు విచిత్రంగా ఉన్నాయని టీడీపీ అధినేత అన్నారు. వైసీపీ అధినేత జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై స్పందిస్తూ..‘జగన్ నివాసంలో హత్య జరిగితే ఏం చేశారు? ఆధారాలు మాయం చేస్తే చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మాజీ సీఈసీ ఖురేషీయే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు.డీపీ గెలుస్తుందని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ‘ఏప్రిల్ 11న ఈవీఎంల సమస్యలు తలెత్తడంతో నేను ఒక్క పిలుపు ఇచ్చాను. మీరు ఓటు మిస్ కావొద్దండి. వచ్చి ఓటు వేయండి అని పిలుపు ఇవ్వగానే సాయంత్రం ఆరు గంటలకల్లా పోలింగ్ కేంద్రానికి చేరుకుని మరుసటి రోజు ఉదయం 4.30 గంటల వరకూ లైన్లలో నిలబడి ఓటు వేశారు. టీడీపీ విశ్వసనీయతకు ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని అడుగుతున్నాని తెలిపారు. టీడీపీ గెలవకుంటే జన్మభూమికి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఏపీ ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులను రద్దు చేసినా, రైళ్లలో రిజర్వేషన్ దొరక్కపోయినా ఏ వాహనం దొరికితే దానిలో ప్రజలు తరలివచ్చి ఓటు వేశారు.’ అని గుర్తుచేశారు. ‘తొలిసారి టీడీపీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టారు. నేను రాజకీయాల్లో గత 40 ఏళ్లుగా ఉన్నప్పటికీ గత ఐదేళ్లలో జరిగినన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడూ జరగలేదు’ అని చంద్రబాబు పునరుద్ఘాటించారు.
Previous Post Next Post