కేసీఆర్ టైం అయిపోయింది - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేసీఆర్ టైం అయిపోయింది

నాగర్ కర్నూల్ మే 15 (way2newstv.com)
స్వంత రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతుక నీయని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేంధ్రంలో చక్రం తిప్పతానని కేసీఆర్ మాటలు వల్లించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని టీపీసీసీ నేత, శాసన సభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. ప్రాజెక్టుల రీడీజైన్ల పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్న సియం కేసీఆర్ ఆ డబ్బుతో ప్రతిపక్ష పార్టీ ఏమ్మెల్యేలను కోనుగోలు చేస్తు ప్రజాస్వామ్యాన్ని ఆపహస్యం చేస్తున్నారని అయన విమర్శించారు.  ఫెఢరల్ ఫ్రంట్ పేరుతో డ్రామాలు ఆడుతున్న కేసీఆర్ కాంగ్రేస్ పార్టీకి దగ్గర కావాలని అయన చూస్తున్నారు.  కేసీఆర్ చేసిన ఆవినీతి బయట పడకూడదనే కాంగ్రెస్ పక్షాలను దగ్గర ఆవుతున్నారు.


కేసీఆర్ టైం అయిపోయింది

ప్రజా స్వామ్య పరీరక్షణ యాత్రలో భాగంగా కోల్లాపూర్ వెళ్లుతూ అచ్చంపేటలో మీడియాతో  అయన మాట్లాడారు. మిషన్ భగీరథ పథకంలో అంచనాలను విపరీతంగా పెంచి తన ఆనుకూలమైన కాంట్రాక్టర్లకు ప్రజాధనాన్ని  కేసీఆర్ దోచి పెడుతున్నారు. రాబోయే కేంధ్ర ప్రభుత్వం కేసీఆర్ తన చేతుల్లో ఉంటే తాను చేసిన ఆర్థిక ఆరాచకాలు బయటకు వస్తాయని  భయందోళలనతో కేంద్రంలో వచ్చే ప్రభుత్వం తన చేతుల్లో ఉంగాలనే కోత్త అలోచనలతో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ టైం ఐపోయింది. చేసిన దోపిడికి మూల్యం చెల్లించక తప్పదని అయన అన్నారు. పార్టి మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని  భట్టి విక్రమార్క డిమాండ్ చేసారు. .