రైట్ టైమ్ కే రుతుపవనాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైట్ టైమ్ కే రుతుపవనాలు

విశాఖపట్నం, మే 15 (way2newstv.com)
దడ పుట్టిస్తున్న ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది.నైరుతి రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది.అంచనాలకు భిన్నంగా ఈసారి కాస్త ముందు భారత దేశాన్ని తాకేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి.అయితే ఇవి జూన్ మొదటి వారంలో ఇవి కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.అన్నదాతలకు ఆసరాగా నిలిచే నైరుతి రుతుపవనాలు రాకతో సూరీడు ఉష్ణతాపం తగ్గేందుకు అవకాశాలు ఉన్నాయి. జూన్ 3 నాటికి ఇవి కేరళకు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. 


రైట్ టైమ్ కే రుతుపవనాలు

తుపాను గాలులు రుతుపవనాల రాకకు మరింత బలానివ్వడంతో ముందస్తుగానే మురిపిస్తున్నాయి. గత ఏడాది జూన్ లో తాకిన రుతుపవనాలు ఈసారి మాత్రం జూన్ మొదటి వారంలో తాకే అవకాశాలు ఉన్నాయి.రుతపవనాలకు అనుకూల వాతావరణంతో  జూన్‌ మోదటి వారంలో కేరళా తీరాన్ని తాకితే రాయలసీమ, తెలంగాణ సరిహద్దుల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులుఅంచనా వేస్తున్నారు.తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజానికానికి ఇది సంతోషకరమైన వార్త అని చెప్పాలి. మరికొద్ది రోజుల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి.మరో పదిహేను రోజుల్లో వాతవరణం చల్లబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక తొలకరి జల్లుల కోసం ఆంధ్రా ప్రజలతో పాటు అన్నదాతలు ఎదురు చూస్తున్నారు.