కోడుమూరు నియోజకవర్గంలో వైసీపీ గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ధన్యవాదాలు తెలిపారు. గుండ్రేవుల ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. కోడుమూరు అభివృద్ధే తమ ధ్యేయమన్నారు. సోమవారం నాడు అయన కోడుమూరు పట్టణంలో పర్యటించారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త హర్షవర్ధన్ రెడ్డి, రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్ఈ అమడగుండ్ల క్రిష్ణ రెడ్డి, వైస్సార్సీపీ ఎన్నికల పరిశీలకులు డి.మధుసూధన్ రెడ్డిలు కుడా పాల్గోన్నారు.
కోడుమూరులో ఎమ్మెల్యే సుధాకర్ పర్యటన
ఎమ్మెల్యే మాట్లాడుతూ కోడుమూరులో ముఖ్యంగా తాగునీటి సమస్య, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయించేందుకు ప్రభుత్వం తరుపున కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అందరికీ నవరత్నల అమలుతో అభివృద్ధి చేస్తామన్నారు. కోడుమూరు అభివృద్ధి పనులలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే సుధాకర్ కోరారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ గోరంట్ల - కొత్తపల్లి గ్రామల మధ్య బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
Tags:
Andrapradeshnews