ఆన్ లైన్ గంజాయి ముఠా గుట్టురట్టు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆన్ లైన్ గంజాయి ముఠా గుట్టురట్టు


వరంగల్, మే 18 (way2newstv.com):
ఆన్ లైన్  ద్వారా గంజాయి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ముఠాను శనివారం వరంగల్ జిల్లా  ఎల్కతుర్తి పోలీసులు అరెస్టు చేసారు. అరెస్టు చేసిన ముఠా సభ్యుల నుండి సుమారు 30లక్షల విలువగల  150 కిలోల శుద్దిచేసిన గంజాయితో పాటు రెండు కార్లు, నాలుగు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  బోనగాని భిక్షపతి,  తీగల రాజు ఆలియాస్ చిన్నరాజు,  జెల్లి యాకయ్య, మాసారపు భూపతి రావు అను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
బానోత్  వీరన్న,  నాయుడు,  రమేష్,   శంకర్ లు పరారీలో వున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ డా. వి.రవీందర్ తెలిపారు.  వీరంతా గతంలో చోరీలు , బందిపోటు దోంగతనాలకు పాల్పడడంతో  పోలీసులు పలుమార్లు అరెస్టు   చేసి జైలుకు తరలించారు. ఈ ముగ్గురు నిందితులు చోరీలు, బందిపోటు దొంగతనాలకు స్వస్తి పలికి మరింత సులువుగా డబ్బు సంపాదించాలనే అలోచనతో ఆన్లైన్ ద్వారా గంజాయి వ్యాపారాన్ని నిర్వహించేందుకు ప్రణాళికను రూపోందించుకున్నారు. 



ఆన్ లైన్ గంజాయి ముఠా గుట్టురట్టు 

ఇందులో భాగంగా నిందితులు ముందుగా మహరాష్ట్ర, మధ్య ప్రదేశ్, అంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి అవసరం వున్న వారికి నెల్ఫోన్ ద్వారా పెద్ద మొత్తంలో ఆర్డర్లు తీసుకుంటారు.  ఆర్డర్లు స్వీకరించిన నిందితులు మరో ఆరుగురు నిందితులను తమ ముఠాల్లో పనిచేసేందుకు గాను నియమించుకు  వారి ద్వారా నాయుడుకు తెలిసిన వ్యక్తుల ద్వారా విశాఖపట్నం జిల్లా నుండి గంజాయిని బోలేరో లాంటి కార్లలో  తాత్కాలికంగా రూపోందించిన రహస్య ప్రదేశంలో గంజాయిని వుంచి వరంగల్ నగరానికి చేరవేస్తారని అయన అన్నారు. అనంతరం ప్రధాన నిందితులు బానోత్  వీరన్న, ఆలియాస్ వినోద్, నాయుడు  ఆర్డర్లు ఇచ్చిన వ్యక్తులకు గంజాయి సిద్దంగా వుంది తమ బ్యాంక్ ఖాతాకు డబ్బు జమచేయాల్సిందిగా సెల్ ఫోన్    ద్వారా సంక్షిప్త సమాచారాన్ని పంపించేవారు. సదరు ఆర్డర్ చేసిన వ్యక్తుల నుండి తమ బ్యాంక్ ఖాతాలకు డబ్బు జమ ఆయినట్లుగా నిర్థారించుకోన్న అనంతరం నిందితులు గంజాయిని కార్ల ద్వారా మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, అంద్రప్రదేశ్లకు తమ ముఠా సభ్యులతో తరలించేవారు.  పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఒకడైన బానోత్ వీరన్నపై గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జఫర్గడ్ మరియు పాలకుర్తి పోలీస్ స్టేషన్ల పరిధి బందిపోటు దోంగతనాలు మరియు దోంగతనాలకు సంబంధించి మూడు కేసులు నమోదు కావడంతో పాటు, మధ్యప్రదేశ్, మహరాష్ట్ర రాష్ట్రాల్లో గంజాయి అక్రమ రవాణా సంబంధించి పలు కేసులు నమోదు కాగా, బోనగాని బిక్షపతిపై ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దోంగతనంతో పాటు అంధ్రప్రదేశ్లో గంజాయి కేసులు నమోదయినాయి.అధే విధంగా మరో నిందితుడు నాయుడుపై అంధ్రప్రదేశ్లో గంజాయి రవాణాకు సంబంధించి పలు కేసులు వున్నాయి.