పరుగులు పెడుతున్న మార్కెట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పరుగులు పెడుతున్న మార్కెట్లు


ముంబై, జూన్ 26, (way2newstv.com)
మంగళవారం పరుగులు పెట్టి దేశీ స్టాక్‌మార్కెట్ బుధవారం కూడా అదే జోరు చూపించింది. బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా రెండో రోజూ కూడా పరుగులు పెట్టాయి. నిఫ్టీ 11,850 పాయింట్ల సమీపంలోకి వెళ్లింది. ఇక సెన్సెక్స్ 39,600 దగ్గరకు చేరువైంది. చివరకు సెన్సెక్స్ 157 పాయింట్ల లాభంతో 39,592 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 11,847 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మెటల్, బ్యాంకింగ్ షేర్లు జోరు చూపాయి. రూపాయి పెరుగుదల కారణంగా ఐటీ షేర్లపై ప్రతికూల ప్రభావం పడింద. 
మార్కెట్ హైలైట్స్.. 


పరుగులు పెడుతున్న మార్కెట్లు

✺ నిఫ్టీ 50లో వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, హిందాల్కో షేర్లు లాభాల్లో ముగిశాయి. వేదాంత ఏకంగా 5 శాతానికి పైగా పెరిగింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4 శాతానికి పైగా లాభపడింది. 
✺ అదేసమయంలో బ్రిటానియా, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి. ఇన్ఫోసిస్ 1 శాతానికి పైగా పడిపోయింది. 
✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ముగిశాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లు మినహా మిగతావన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2.7 శాతం పరుగులు పెట్టింది. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ కూడా 1.88 శాతం ఎగసింది. 
✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.07 శాతం పెరుగుదలతో 65.00 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.75 శాతం పెరుగుదలతో 58.86 డాలర్లకు ఎగసింది. 
✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 20 పైసలు పెరుగుదలతో 69.14 వద్ద ఉంది.