వైద్య ఆరోగ్య శాఖ సమూలంగా ప్రక్షాళన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వైద్య ఆరోగ్య శాఖ సమూలంగా ప్రక్షాళన

ఆశా వర్కర్ల వేతనాన్ని రూ.10,000 కు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
అమరావతి జూన్ 3(way2newstv.com)
వైద్య ఆరోగ్య శాఖ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.వైద్య ఆరోగ్య శాఖ పనితీరును మెరుగుపరిచి సమూలంగా ప్రక్షాళన దిశగా, దేశంలోనే ఆదర్శవంతమైన విధానాలను అమలు పరచాలని అయన సూచించారు. పేదలకు ప్రభుత్వ ఆస్పత్రుల ద్వార మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడమే ఈ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని ఆయన తెలిజేశారు. కింద నుండి మీద వరకు వైద్య ఆరోగ్య శాఖ సమూల ప్రక్షాళనకు ఆరోగ్యరంగం నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు, దీనిలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పి.వి.రమేష్ ముఖ్యమంత్రి కార్యాలయం తరఫున సమన్వయ పరుచనున్నట్లు సీఎం తెలిపారు. ఈ కమిటీ- వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులతో సమాలోచనలు జరిపి 45 రోజుల్లో తగు సూచనలతో నివేదిక ను సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. అవినీతికి ఏ మాత్రం ఆస్కారం ఉన్నా సహించేది లేదని, అధికారులు తమ సొంత బాధ్యత గా భావించి పని చేయలని ముఖ్యమంత్రి సూచించారు. 


వైద్య ఆరోగ్య శాఖ సమూలంగా ప్రక్షాళన
 

తాము పని చేసే ప్రతి విభాగం తమ సొంతదని భావిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని, వైద్య ఆరోగ్య రంగంలో మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విధానాలే మనకు ఆదర్శం అని , వైఎస్ఆర్ అప్పట్లో అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108 సర్వీసులు వంటి అనేక విధానాలను పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని అయన గుర్తు చేశారు. మొత్తం 108, 104 సర్వీసులను ప్రక్షాళన చేసి, వాహనాలు పూర్తి స్థాయిలో ఆపరేషన్ లో ఉండేలా చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.వైద్య ఆరోగ్య శాఖకు పునర్వైభవం తేవాలని,దేశమంతా మన వైపే చూడాలని అధికారులకు స్పష్తం చేసారు. ఆరోగ్యశ్రీని ఇక నుండి ‘వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ’గా పేరు మార్చాలని ఆదేశించారు. ఈ శాఖ తనకు అత్యంత ప్రాధాన్యతతో కూడినదని, తానే ప్రత్యక్షంగా ఈ శాఖ పనితీరును పర్యవేక్షిస్తానని స్పష్టం చేసారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల, అంబులెన్స్ ల స్థితిగతులు, పనితీరుపై ఒక నివేదికను ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి,ఆశా వర్కర్ల వేతనాన్ని రూ.10,000 కు పెంచాల్సిందిగా అధికారులను ఆదేశించారు.ప్రతి ఆరోగ్య కేంద్రం, ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తి స్థాయి అవసరాలు ఏమిటి, ప్రభుత్వం నుండి ఏమి కావాలి, మౌలికంగా, ఆర్థికంగా ఎటువంటి అవసరాలు తీర్చాలి.. ఇలా అన్ని వివరాలను తనకు తెలియజేయాలని అధికారులకు సూచించారు.పూర్తి స్థాయిలో వాటన్నిటిని సమకూర్చి ప్రైవేటు ఆస్పత్రుల కన్నా మెరుగ్గా వాటి స్థితిగతులను మెరుగు పరచడానికి సంకల్పించినట్టు స్పష్తం చేసారు.లెక్కలు కేవలం డాష్ బోర్డ్ లేకు పరిమితం అయ్యాయని, వాస్తవాలకు దగ్గరగా అందరు పని చేయాలనీ, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రం, సామజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులు అన్నిటి ఫొటోగ్రాఫ్ లను తీసి చూపాలని జగన్ ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, ఇతర పోస్టుల భర్తీపై సానుకూలంగా స్పందించిన జగన్, పోస్టుల భర్తీ, ఆర్ధిక అవసరాలు, మౌలిక అభివృద్ధిపై నివేదికను తక్షణమే రూపొందించాల్సిందిగా అధికారులను కోరారు.గత నాలుగేళ్లలో ఎప్పుడు లేని విధంగా అనేక సంఘటనలు చూసాం.. రోగులను ఎలకలు కోరికేయడం, ఆపరేషన్ ధియేటర్లలో విద్యుత్ సరఫరా అందక సెల్ ఫోన్ లైట్లతో శస్త్ర చికిత్స జరగడం.. వంటి సంఘటనలు ఆశ్చర్యం కలిగించాయని , ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పెంచడానికి అడ్డంకులు ఎందుకు రావాలి. సౌకర్యాలు లేవని సీట్ల కేటాయింపు చేయకపోతే దానిపై ఎందుకు గట్టిగా చర్యలు తీసుకోకూడదు. అని అధికారులను ప్రశ్నించారు. నిబంధనలను వెంటనే సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎటువంటి ఆటంకం లేకుండా వైద్య విద్య అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.నకిలీ మందులు, నాణ్యత లేని ఔషధాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ,ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే సరైన ధరలకు, నాణ్యమైన మందులు లభిస్తాయని విశ్వాసం ప్రజల్లో తీసుకురావాలని, ఆ దిశగా చర్యలు ఉండాలని అధికారులకు సూచించారు. వైద్య పరికరాలు, మందులు, మౌలిక సౌకర్యాలు టెండరింగ్ విధానాలను పునఃసమీక్షించాలని ,మొత్తం వైద్య ఆరోగ్య వ్యవస్థలో సమూల మార్పులు రావాలని, కింద నుండి మీద వరకు పూర్తి ప్రక్షాళన దిశగా చర్యలు ఉంటాయని అయన స్పష్టం చేసారు.