కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం లేనట్టే... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం లేనట్టే...


విజయవాడ, జూన్ 4(way2newstv.com)
మంత్రివర్గ కూర్పుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు మొదలుపెట్టారు. అమాత్య పదవుల కోసం ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో మంత్రుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. అయితే కేబినెట్‌ కూర్పుపై తండ్రి వైఎస్‌‌ను ఫాలో కావాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌ విస్తరణకు డేట్‌ అండ్ టైమ్‌ ఫిక్స్‌ చేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారు. 151మంది ఎమ్మెల్యేలతో సూపర్ విక్టరీ కొట్టిన వైఎస్ జగన్‌కు అమాత్యుల ఎంపిక కత్తి మీద సాములా మారింది. 


కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం లేనట్టే...
కేవలం 25మందికి మాత్రమే కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం ఉండటంతో వడపోత మొదలుపెట్టారు. అయితే గతంలో వైఎస్ అనుసరించిన ఫార్ములానే ఇంప్లిమెంట్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ ఫార్ములా ప్రకారం మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచివాళ్లను పక్కనబెట్టనున్నట్లు తెలుస్తోంది. 151మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో 67మంది మొదటిసారి గెలిచివాళ్లే ఉన్నారు. ఒకవేళ జగన్ జూనియర్స్‌కి చోటు లేదనే సూత్రాన్ని అమలు చేసినట్లయితే, వీళ్లంతా ఛాన్స్ కోల్పోతారు. మిగిలిన 84మంది ఎమ్మెల్యేల్లోనూ జిల్లాల వారీగా సీనియారిటీ, కుల-మత సమీకరణాలతో మంత్రులను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే సీనియర్లతోపాటు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవుల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ‌్యంగా యువ ఎమ్మెల్యేలు తమకు జగన్ అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.