బడ్జెట్ సమావేశాలల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి


టీబీసీ ఐకాస 
జగిత్యాల జూన్ 7 (way2newstv.com)
దేశ తొలి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జులై 5 న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్ట నున్నందున ఈ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని  టీబీసీ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయ ఆవరణలో  టీ బీసీ మహిళా ఐకాస జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడారు.రాజ్యసభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లునుఅమలు కున్న   అడ్డంకులు తొలగించడానికి 17 వ లోకసభకు పుష్కల అవకాశాలున్నాయన్నారు. 


బడ్జెట్ సమావేశాలల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి
ఈ 17 వ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ లు రెండూ మహిళా బిల్లుకు మద్దతు ఇస్తామని చెప్పాయన్నారు.ఇలాంటి సమయంలో మళ్ళి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు ఆమోదించడానికి కృషిచేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో జిల్లా టీబీసీ  మహిళఐకాస  జిల్లాఅధ్యక్షులు,కార్యదర్శులు పి.విజయ ,కస్తూరి శ్రీమంజరి ,భారతి,టీ బీసీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయ్,ఉపాధ్యక్షుడు సింగం భాస్కర్,జిల్లా నాయకులు రాజగోపాల్ చారి,కూసరి అనిల్ కుమార్,టీ నరసింహ చారి,వెంకటరమణ,మనపురి రాజనర్సయ్య.  మరిపెళ్ళి పోచయ్య,దేవయ్య, లత,శోభ,రాజశ్రీ,రజిత, కమల  టీబీసీ మహిళా ఐకాస జిల్లా, డివిజన్,మండలం ప్రతినిధులు పాల్గొన్నారు.
Previous Post Next Post