నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ వంటి నేతను చూడలేదు- - బొత్స సత్యనారాయణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ వంటి నేతను చూడలేదు- - బొత్స సత్యనారాయణ


విజయవాడ, జూన్ 7 (way2newstv.com)
తనకిప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డిని మించిన నేత వైఎస్ జగన్ లో కనిపిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.   శుక్రవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ నేతా తీసుకోనటువంటి నిర్ణయాలను జగన్ తీసుకుంటున్నారని అన్నారు. 


నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ వంటి నేతను చూడలేదు- - బొత్స సత్యనారాయణ
ఎంతో మంది ముఖ్యమంత్రులు మాటలు చెప్పారని, చేతల్లో చేసి చూపుతున్న సీఎం మాత్రం జగనేనని కొనియాడారు. ముఖ్యంగా 50 శాతం పదవులు బడుగు, బలహీనవర్గాలకు ఇస్తూ, పూర్తి సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నారని అన్నారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో స్వర్ణయుగం రానున్నదని అంచనా వేసిన బొత్స, అన్ని వర్గాలకూ న్యాయం చేయాలన్న జగన్ తపన, వేస్తున్న అడుగులు బంగారు భవిష్యత్ ను సూచిస్తున్నాయని అన్నారు.  రాష్ట్రంలో సుపరిపాలన రావాలని చెబుతూ, తన మనసులోని ఆలోచనలను జగన్ పంచుకున్నారని, జగన్ కు హ్యాట్సాఫ్ అని కొనియాడారు.