ఎంసెట్ టాపర్లు వీరే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎంసెట్ టాపర్లు వీరే


విజయవాడ, జూన్ 4, (way2newstv.com)
ఏపీ ఎంసెట్-2019 ఫలితాలు వెల్లడయ్యాయి. విజయవాడ తాడేపల్లిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మంగళవారం (జూన్ 4) ఉదయం 11.30 గంటలకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు పలు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారు. ఆయా వెబ్‌సైట్ల ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. 
✪ ఫలితాల్లో మొత్తం 79 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో ఇంజినీరింగ్ విభాగంలో 74.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 1,85,711 మంది విద్యార్థులకుగాను 1,38,160 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో 83.64 శాతం ఉత్తీర్ణత నమోదైంది.మొత్తం 81,916 మంది విద్యార్థులు హాజరుకాగా.. 65,512 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 


ఎంసెట్ టాపర్లు వీరే

✪ ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకులను అధికారులు కేటాయించారు. విద్యార్థులు జూన్ 10 నుంచి ఎంసెట్ ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థుల మొబైల్ ఫోన్లు, ఈమెయిల్‌కు కూడా ఫలితాలను పంపారు. 
✪ ఇంజినీరింగ్ టాప్-10 ర్యాంకర్లు...
ర్యాంకు పేరు
1 కురిశెట్టి రవిశ్రీతేజ
2 పి.వేదప్రణవ్‌
3 జి.భానుదత్త
4 డి.చంద్రశేఖర్‌ ఎస్‌ఎస్‌ హేద హవ్య
5 బట్టెపాటి కార్తికేయ
6 రిషి షరఫ్‌
7 జి.వెంకటకృష్ణ సూర్య లిఖిత్‌
8 ఎ. అభిజిత్ రెడ్డి
9 ఆర్యన్ లడ్డా
10 ఎ.హేమవెంకట అభినవ్
✪ అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో టాప్-10 ర్యాంకర్లు.. 
ర్యాంకు పేరు
1 సుంకర సాయి స్వాతి
2 దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి
3 అత్యం సాయి ప్రవీణ్‌ గుప్తా
4 తిప్పరాజు హర్షిత
5 జి.మాధురిరెడ్డి
6 గొంగటి కృష్ణ వంశీ
7 కంచి జయశ్రీ వైష్ణవీ వర్మ
8 బి.సుభిక్ష
9 కొర్నెపాటి హరిప్రసాద్‌
10 ఎంపటి కుశ్వంత్
ఏపీ ఎంసెట్‌కు సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు ఏప్రిల్ 20 నుంచి 24 వరకు పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 2,82,633 మంది అభ్యర్థులు ఎంసెట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో ఇంజినీరింగ్ విభాగం నుంచి 1,95,908 మంది; అగ్రికల్చర్, మెడికల్ విభాగాల నుంచి 86,910 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ఇంజినీరింగ్ పరీక్షలకు 1,85,711 మంది హాజరుకాగా.. అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు పరీక్షలకు 81,916 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి దాదాపు 36,698 మంది విద్యార్థులు ఏపీ ఎంసెట్ పరీక్షలకు హాజరైన సంగతి తెలిసిందే. కాగా.. ఇంజినీరింగ్ ప్రాథమిక కీని ఏప్రిల్ 24న; అగ్రికల్చర్, మెడికల్ ప్రాథమిక కీని ఏప్రిల్ 25న విడుదల చేశారు. కీపై అభ్యంతరాలను సేకరించారు. అయితే మే మొదటి వారంలోనే ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా.. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జాప్యం కారణంగా ఎంసెట్ ఫలితాల వెల్లడి దాదాపు నెలరోజులు ఆలస్యంగా జరిగింది. గత నాలుగేళ్లలో జూన్‌లో ఫలితాలు విడుదల చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.