అనిత దెబ్బతో కంచుకోటకు బీటలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అనిత దెబ్బతో కంచుకోటకు బీటలు


ఏలూరు, జూన్ 1, (way2newstv.com)
ఆ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచుకోట‌. ఇక్కడ నుంచి వ‌రుస పెట్టి గెలిచిన పార్టీ … కేవ‌లం ఒకే ఒక్కసారి మాత్రమే ఓడింది. ఆ త‌ర్వాత ఏ పార్టీ కూడా ఇక్క‌డ నుంచి పోటీ చేయాలంటేనే ఆలోచించే విధంగా చేసిన టీడీపీకి ఇప్పుడు అదే కంచుకో ట‌లో భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. వ‌ల‌స ప‌క్షిగా వ‌చ్చిన ఓ మ‌హిళా నాయ‌కురాలు . తాను ఓడి.. పార్టీని కూడా మ‌ట్టి క‌రిపించిన రికార్డును సొంతం చేసుకున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని టీడీపీ కంచుకోట నియోజ‌క‌వ‌ర్గం కొవ్వూరు. ఎస్సీల‌కు రిజ‌ర్వ్ చేసిన త‌ర్వాత‌, దానికి ముందు కూడా ఇక్కడ టీడీపీ బ‌ల‌మైన శ‌క్తిగా అవ‌తరించింది.అభ్యర్థులు ఎవ‌ర‌నే విష‌యాన్ని ప‌క్కన పెట్టి ఇక్కడ ప్ర‌జ‌లు టీడీపీ జెండాను నెత్తిన మోశారు. ఈ క్రమంలో గ‌త 2014లో స్థానికేత‌రుడే అయిన‌ప్పటికీ.. కేఎస్ జ‌వ‌హ‌ర్‌కు ప్రజ‌లు ప‌ట్టం క‌ట్టారు. ఆయ‌న త‌ర్వాత కాలంలో మంత్రిగా కూడా ప‌గ్గాలు చేప‌ట్టారు. 


అనిత దెబ్బతో కంచుకోటకు బీటలు
అయితే, ఈ ద‌ఫా మాత్రం ఇక్క‌డ టీడీపీ కేడ‌ర్ ఎదురు తిరిగింది. స్థానికంగా ఉన్న నేత ఎవ‌రికి టికెట్ ఇచ్చినా తాము గెలిపిస్తామ‌ని, లేకుండా ఇబ్బందేన‌ని అల్టిమేట‌ం ఇచ్చింది. అయిన‌ప్పటికీ.. ఇక్కడ చంద్రబాబు మాత్రం విశాఖ జిల్లా పాయ‌క‌రావు పేట ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత‌కు ఇక్కడ టికెట్ ఇచ్చారు. ఆమె నామినేష‌న్ వేసిన రోజునే ఆమె ఓట‌మి ఖ‌రారైంద‌ని ఇక్కడి త‌మ్ముళ్లు బెట్టింగులు కూడా క‌ట్టారు.అసెంబ్లీలో మ‌హిళా ఎమ్మెల్యేగా బ‌ల‌మైన వాయిస్ వినిపించ‌డంతో పాటు వైసీపీ లేడీ ఫైర్‌బ్రాండ్ రోజాను ధీటుగా ఎదుర్కోవ‌డంతో అనిత‌ను తిరిగి ఎలాగైనా అసెంబ్లీకి తీసుకురావాల‌ని బాబు అనుకున్నారు. పాయ‌కారావుపేట‌లో ఆమె ఓడిపోతుంద‌ని ఆమెను కొవ్వూరు పంపారు. వాస్త‌వంగా జ‌వ‌హ‌ర్ కాjర‌ణంగా స్థానిక నేత‌లు విసిగిపోయి ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గ టీడీపీని శాసించే వారంతా ఈ సారి స్థానిక నేత‌కే ఛాన్స్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అయినా అనిత‌ను త‌మ‌పై బ‌ల‌వంతంగా రుద్దడంతో వారు అప్పుడే ఆమెను ఓడించి బాబుకు షాక్ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. అయినా..కూడా కేంద్రంలో ఓమంత్రి సిఫార‌సు ఉన్న కార‌ణంగా చంద్ర‌బాబు లొంగిపోయారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనిత ఘోర ప‌రాజ‌యం చవిచూసింది.దాదాపు 27 వేల ఓట్ల తేడాతో ఆమె ఓడిపోవ‌డ‌మే కాకుండాటీడీపీ కంచుకోట‌ను బ‌ద్దలు కొట్టేందుకు త‌న‌వంతు స‌హ‌కారం అందించింద‌నే ప్రచారం జోరుగా సాగుతోంది. నిజానికి ఇక్క‌డ అనేక మంది నాయ‌కులు టికెట్ కోసం వేచి చూశారు. చంద్రబాబు కూడా అనేక స‌ర్వేలు చేయించారు. వ్యతిరేక‌త ప్రబ‌లంగా ఉంద‌ని తెలిసి కూడా మ‌రోసారి ఆయ‌న స్తానికేత‌రురాలికే టికెట్ ఇవ్వడాన్ని త‌మ్ముళ్లు జీర్ణించుకోలేక పోయారు. దీంతో ఓట‌మి అంచుకు చేర‌డం కాదు.. ఘోరంగా ఓడిపోయే ప‌రిస్థితిని చ‌విచూశారు. ఇది పూర్తిగా బాబు స్వయంకృత‌మ‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.