రాజశేఖర్ రెడ్డి తరహాలోనే జగన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాజశేఖర్ రెడ్డి తరహాలోనే జగన్


గుంటూరు, జూన్ 14, (way2newstv.com)
అవును! ఏపీలో కొత్తగా కొలువుదీరిన వైసీపీ అధినేత జ‌గ‌న్ తొలి రోజు నుంచి కూడా విభిన్నమైన శైలిలో రాజ‌కీయాలు చేస్తున్నారు. పాల‌న‌లో దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్కరినీ క‌లుపుకొని పోతున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న తీసుకుం టున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు కూడా సంచ‌ల‌నం దిశ‌గా దూసుకుపోతున్నాయి. తాజాగా 25 మందితో పూర్తిస్థాయి కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు జ‌గ‌న్‌., వీరిలో ముగ్గురు మ‌హిళ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. దీంతో రాష్ట్ర రాజ కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇక‌, జ‌గ‌న్ త‌న కేబినెట్ కూర్పు, మంత్రి ప‌ద‌వుల కేటాయింపు, పోర్ట్ ఫోలియో ల కేటాయింపులోనూ భిన్నమైన వైఖ‌రినే ప్రద‌ర్శించారు.2004లో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేప‌ట్టిన వైఎస్‌.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా హోంమంత్రి ప‌ద‌విని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి విజ‌యం సాధించిన స‌బితా ఇంద్రారెడ్డికి కేటాయించి సంచ‌ల‌నం సృష్టించారు. 


రాజశేఖర్ రెడ్డి తరహాలోనే జగన్ 
అస‌లు అప్పటి వ‌ర‌కు కూడా హోం మంత్రిప‌ద‌విని మ‌హిళ‌కు ఇస్తారనే ఆలోచ‌న కూడా చేయ‌ని కాంగ్రెస్ నాయ‌కులు షాక్‌కు గుర‌య్యారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ ఏపీలోనూ ఇలాంటి నిర్ణయ‌మే తీసుకున్నారు అయితే, ఈయ‌న కూడా సంచ‌ల‌నం సృష్టించారు. హోం మంత్రి ప‌ద‌విని మ‌హిళ‌కు ఇస్తార‌ని అంద‌రూ అనుకున్నారు కానీ. ఏకంగా ద‌ళిత మ‌హిళ‌కు కేటాయిస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదునేరుగా ఈ ప‌ద‌విని ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రిత‌కు ఇచ్చిన జ‌గ‌న్ రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు తాను ఇచ్చే ప్రయ‌ర్టీ ఇదేన‌ని చెప్పుకొచ్చారు. అదేవిధంగా స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంక‌ట్రామ‌య్య ఉర‌ఫ్‌ నానికి కేటాయించారు. ఇక్కడ చిత్రమేంటంటే.. గ‌తంలో పేర్ని నాని తండ్రి.. కూడా స‌మాచార శాఖ మంత్రిగా ప‌నిచేశారు. ఈ క్రమంలోనే ఆయ‌న జ‌ర్నలిస్టుల‌కు ఎన్నో మేళ్లు చేశారు. బంద‌రు నుంచి గెలిచిన పేర్ని కృష్ణమూర్తి ఏ మంత్రిగా ప‌నిచేశారో ఇప్పుడు కాక‌తాళీయంగా ఆయ‌న కుమారుడికి కూడా అదే శాఖ ల‌భించింది. నాని ముందు నుంచే త‌న‌కు కేబినెట్ బెర్త్ రాద‌ని స‌న్నిహితుల‌కు చెప్పేశారు. త‌న‌కంటే సీనియ‌ర్ అయిన కొడాలి నానికి క‌మ్మ కోటాలో బెర్త్ వ‌స్తుంద‌ని ఆయ‌న చెప్పినా జ‌గ‌న్ అనూహ్యంగా ఇద్దరు నానీల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు.తండ్రి, కొడుకులు ఇద్దరూ ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించ‌డంతో పాటు ఇప్పుడు ఒకే శాఖ‌కు మంత్రులు అయిన అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అదే విధంగా ప్రస్తుతం నాని కూడా ఏపీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జ‌ర్నలిస్టుల‌కు మేలు చేయాల‌ని జ‌ర్నలిస్టు సంఘాలు కోరుతున్నాయి. గత ప్రభుత్వంలో పెండింగ్‌లో పెట్టిన గృహాలు, హెల్త్‌స్కీమ్‌, వేతన సవరణ, జర్నలిస్టులపై దాడుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు.. జర్నలిస్టుల సంక్షేమానికి నాని కృషి చేయాల్సి ఉంది.