``ఓ చిన్న న‌వ్వే చాలు ప‌దా ప‌ల‌క‌రిద్దాం...`` అంటున్న `ఎంత మంచివాడ‌వురా` - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

``ఓ చిన్న న‌వ్వే చాలు ప‌దా ప‌ల‌క‌రిద్దాం...`` అంటున్న `ఎంత మంచివాడ‌వురా`

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత మంచివాడ‌వురా`. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణప్రసాద్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.జాతీయ అవార్డ్ గ్ర‌హీత మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ సంగీత సారథ్యం వ‌హిస్తోన్న ఈ సినిమాలో మూడో పాట‌ను చిత్ర యూనిట్ రేడియో మిర్చిలో శుక్ర‌వారం విడుద‌ల చేసింది. ఈ కార్య‌క్ర‌మంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న‌, పాట‌ల ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రి పాల్గొన్నారు.
 ``ఓ చిన్న న‌వ్వే చాలు ప‌దా ప‌ల‌క‌రిద్దాం...`` అంటున్న `ఎంత మంచివాడ‌వురా`

``ఓ చిన్న న‌వ్వే చాలు ప‌దా ప‌ల‌క‌రిద్దాం
ఓ చిన్న మాటే చాలు.. బంధాల‌ల్లుకుందాం
ఏ ఊరు మీదే పేరు.. అడిగి తెలుసుకుందాం
ఎవ‌రైనా మ‌న‌వారేగా.. వ‌ర‌స క‌లుపుకుందాం.........``
 అంటూ కూల్‌గా ఈ పాట ఉంది. మ‌నుషుల మ‌ధ్య బంధాలను నిలుపుకోవాల‌ని, కాబ‌ట్టి ప్ర‌తి ఒక్క‌రితో క‌లిసిపోవాల‌ని అర్థం చెప్పేలా పాట ఉంది.
పెళ్లి సంద‌ర్భంలో వ‌చ్చే ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాయ‌గా.. అనురాగ్ కుల‌క‌ర్ణి, గీతా మాధురి పాడారు.
ప్ర‌స్తుతం ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 15న విడుల చేస్తున్నారు.
న‌టీన‌టులు:  నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, మెహ‌రీన్‌, వి.కె.న‌రేశ్‌, సుహాసిని,శరత్‌బాబు,త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు