స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్


విశాఖపట్నం, జూన్ 4 (way2newstv.com)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చినముషిడివాడలోని శారదా పీఠానికి  మంగళవారం ఉదయం చేరుకున్నారు. పూర్ణకుంభంతో వేదపండితులు ఆయనకు స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తులు ధరించిన సీఎం వైఎస్ జగన్ స్వరూపానందేంద్ర స్వామికి కానుకలు సమర్పించారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకుని.. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. మరికాసేపట్లో సీఎం తిరుగుపయనమవుతారు. పాదయాత్రలో ఇచ్చిన హామీమేరకు ఆశ వర్కర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.3 వేల నుంచి 10 వేలకు పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 


స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్
దీనిపై హర్షం వ్యక్తం చేసిన ఆశా వర్కర్లు.. శారదా పీఠాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.శారదా పీఠం నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి ముఖ్యమంత్రి వెళ్తారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు సజ్జల రామకృష్ణా రెడ్డి, తలశిల రఘురాంతో పాటు మరో 7గురు వైఎస్సార్సీపీ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్టు నుంచి చినముషిడివాడ శారదా పీఠం వరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 14 కిలోమీటర్లు అడుగడుగునా పోలీసుల పహారా నెలకొని ఉంది. శారదా పీఠం పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇక సీఎం  రానుండటంతో ఏ.డీ జంక్షన్ పరిసర ప్రాంతాల్లో అభిమానులు భారీగా ఆయన స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం హోదాలో వైఎస్ జగన్ తొలిసారి విశాఖ రావడం జరిగింది.ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విశాఖ ఎయిర్పోర్టులో అదనపు భద్రతా చర్యలు చేపట్టారు. సాధారణ ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మరోమార్గం గుండా సీఎం రాకకు ఎయిర్పోర్టు అధికారులు ఏర్పాట్లు చేశారు
Previous Post Next Post