దేవుడే కామా పెట్టాడు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దేవుడే కామా పెట్టాడు


అమరావతి జూన్ 29 (way2newstv.com)
దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్లూ ఉంటాయి జగన్ గారూ! దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించలేదు. రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శనివారం అయన ట్వీట్టర్ లో  సీఎం జగన్ మోహన్ పై విమర్శలు గుప్పించారు.  అది ఫుల్స్టాప్ అనుకున్నారు మీరు.  ఈ గ్యాప్లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాలనుకుంటున్నారు. 

దేవుడే కామా పెట్టాడు

టీడీపీ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమం అని మీరంటే...  అవి ముట్టుకుంటే షాక్ కొడతాయని కేంద్రంతో లేఖ రాయించాడని అయన ఎద్దేవ చేసారు. దేవుడి స్కిప్ట్ లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయి. భ్రమరావతి అన్న మీ భ్రమలు తొలగించుకునేందుకు దేవుడే ఓ ఛాన్సిచ్చాడు.  సెక్రటేరియట్లో సీఎం సీటులో కూర్చున్నప్పుడైనా, అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడైనా చంద్రబాబుగారికి మనసులో కృతజ్ఞతలు చెప్పుకో అని స్క్రిప్ట్ లో మళ్లీ కామా పెట్టాడని అయన వ్యాఖ్యానించారు.