రాజమండ్రి, జూన్ 24, (way2newstv.com)
జనసేన పార్టీ నుంచి ఎంపిగా గెలిచి తన పార్లమెంట్ కి వెళ్లాలన్న డ్రీం నెరవేర్చుకుందామనుకున్న మాజీ ఎమ్యెల్యే డా. ఆకుల సత్యనారాయణ ఆ పార్టీకి దూరం కానున్నారా ? అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు. ఎన్నికల్లో ఓటమి తరువాత జనసేన కు దూరంగా వుంటూ వస్తున్న రాజమండ్రి మాజీ ఎమ్యెల్యే ప్రజల్లో లేని పార్టీ లో ఉండి ఉపయోగం లేదని భావిస్తున్నట్లు తెలుస్తుంది. బిజెపి నుంచి ఎమ్యెల్యేగా గెలిచాకా ఆ పార్టీకి 2019 ఎన్నికల ముందు గుడ్ బై కొట్టి పవన్ కళ్యాణ్ సమక్షంలో సతీసమేతంగా జనసేన తీర్ధం స్వీకరించారు ఆకుల సత్యనారాయణ. ఆయన రాకతో తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో జనసేనకు ఊపు వచ్చిందని సాక్షాత్తు పవన్ తెగ పొగిడారు. మీ సారధ్యంలో జిల్లా దున్నేద్దామన్నారు పవన్ కళ్యాణ్.నిజానికి డాక్టర్ ఆకుల కుటుంబం పవన్ కళ్యాణ్ కి వీర భక్తులు. అయితే ఆశించినట్లే పవన్ ఆయనకు పార్లమెంట్ టికెట్ ఇచ్చి న్యాయం చేసినా ఆయన నియోజక వర్గ పరిధిలో చెప్పిన వారెవరికీ ఎమ్యెల్యే టికెట్లు ఇవ్వలేదు.
వీర విధేయులు దూరం అవుతారా
అప్పుడే ఆయన రాజీనామా చేసేస్తారని టాక్ వచ్చినా సన్నిహితులు వారించడంతో వెనక్కి తగ్గారు. తన పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలో తన పని తాను చేసుకుపోయారు తప్ప అభ్యర్థులకు ఆర్ధిక సహకారం ఎంపి అభ్యర్థిగా చేయకపోవడంతో పోటీలో వున్నవారు తీవ్ర ఇబ్బందులే పడ్డారు. మొత్తానికి ఎన్నికలు పూర్తి అయ్యాకా జనసేన ఘోర పరాజయం స్వయంగా అధ్యక్షుడే రెండు చోట్ల ఓడిపోవడంతో ఇక ఆ పార్టీలో కొనసాగడం సరికాదని సన్నిహితులు సూచించినట్లు తెలుస్తుంది.ఓటమి తరువాత ప్రజల ముందుకు రాని డాక్టర్ ఆకుల సత్యనారాయణ తాజాగా ఒక మీడియా సమావేశం ఇసుక పాలసీకి సంబంధించి ఏర్పాటు చేశారు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన పార్టీ మారనున్నారనే అంశాన్ని దాదాపు స్పష్టం చేశాయి. ఎపి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కొద్దికాలంలోనే అందరి మనసులు గెలుచుకున్నారంటూ ఆ పార్టీ లోకే వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. అలాగే కేంద్రంలో బిజెపి ని ప్రజలు ఆదరించారని మోడీ పాలన పట్ల అంతా సంతృప్తిగా వున్నారని దేశం కోసం ఆ పార్టీ మంచిదే అంటూ చెప్పుకొచ్చి తనకు రాజకీయ భవిత కల్పించిన పార్టీ వైపు చూస్తున్నారు డాక్టర్. కుల ఆధారంగా వుండే పార్టీలకు మనుగడ లేదని జనసేన, పవన్ కళ్యాణ్ పై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఎన్నికలు ముగిశాకా జనసేన కార్యకలాపాలు ఎక్కడున్నాయంటూ ప్రశ్నించి తన ఉద్దేశ్యం చెప్పేశారు ఆయన. ప్రజలు ఎటు వైపు ఉంటే నేతలు అటు ఉండటమే తాజా రాజకీయమన్న డాక్టర్ ఆకుల జనసేన కు గుడ్ బై కొట్టడం దాదాపు ఖాయమనే చెప్పాలి. అయితే ఆయన పాత గూటికే చేరతారా ? లేక ఫ్యాన్ కింద సేదతీరుతారో