అచ్చెన్నే.. కంఠంమే ప్రత్యేక ఆకర్షణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అచ్చెన్నే.. కంఠంమే ప్రత్యేక ఆకర్షణ


శ్రీకాకుళం, జూన్ 20, (way2newstv.com)
మనిషి చూస్తే ఆజానుబాహుడు. మాట కూడా అంతే స్థాయిలో గంభీరంగా దూసుకువస్తుంది. లెక్కలతో సహా పిట్టకథలు చెబుతూ సాగే ప్రసంగం. దీనికి తోడు ఉత్తరాంధ్రా యాస అదనపు ఆకర్షణ. ఆయనే శాసనసభలో అధికారపార్టీపై ఒక్కడై దుమ్మురేపుతున్నటిడిపి ఉప ప్రతిపక్ష నేత కింజారపు అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వంలో మంత్రిగా వున్నప్పుడు సైతం జగన్ సేనపై ఎటాకింగ్ కి అచ్చెన్న నే దింపేవారు చంద్రబాబు. అయితే విపక్షం శాసనసభను బహిష్కరించాకా ఆయన గొంతు మూగబోవలిసి వచ్చింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి టిడిపి విపక్షంలో వచ్చి పడ్డాకా అచ్చన్న కంచు కంఠం టిడిపి కి వరంగా మారింది. అందుకే ఫ్రంట్ లైన్ బౌలింగ్ కి బ్యాటింగ్ కి ఆయన్నే వినియోగిస్తున్నారు తెలుగుదేశం అధినేత.


అచ్చెన్నే.. కంఠంమే ప్రత్యేక ఆకర్షణ

కింజారపు కుటుంబం రాజకీయాల్లో పడిపోయింది. దాంతో చట్టసభల చరిత్ర అక్కడ నడుచుకోవాలిసిన వ్యవహార సరళి వారికి కొట్టిన పిండి. స్వర్గీయ కింజరపు ఎర్రన్నాయుడు సైతం ఇదే తీరులో తమ వ్యతిరేక పార్టీలపై గళం ఎత్తి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన వారసుడు కింజారపు రామ్మోహన్నాయుడు సైతం పార్లమెంట్ లో చేస్తున్న ప్రసంగాలు ధాటిగానే ఉంటాయి. ఇప్పటికే రామ్మోహన్ ప్రసంగాలపై అందరి ప్రశంసలు లభించాయి. రామ్మోహన్ సోదరి నూతనంగా రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన ఆదిరెడ్డి భవాని కి సైతం ఆ వాగ్ధాటి కుటుంబం నుంచి లభించినా అనుభవం లేకపోవడం పార్టీ ప్రతిపక్షం లో ఉండటంతో ఆమె ప్రసంగాలకు ఆస్కారం దక్కడం లేదు.ప్రస్తుతం పార్టీ వాయిస్ ను వినిపించడంలో అచ్చెన్న ఫామ్ లో ఉన్నప్పటికీ టిడిపిలో మాటల మాంత్రికుల్లో మరో ఇద్దరు ప్రభుత్వానికి తలనొప్పి సృస్ట్టించే వారు వున్నారు. వారే పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తలపండిన రాజకీయాలు చూసిన వీరిద్దరూ వ్యూహాత్మకంగా కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. కమ్మ సామాజిక వర్గానికే ప్రతిపక్షంలో వున్నప్పుడు కూడా బాబు ప్రాధాన్యత ఇచ్చారనే అపవాదు కొనసాగుతుందన్న భయంతోనే అధినేత వారిని కొంత తగ్గమన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. గత ప్రభుత్వం మాదిరి కాకుండా స్పీకర్ ప్రతిపక్షానికి పూర్తిగా సహకరిస్తూ వారికీ మైక్ ఇస్తుండటంతో రాబోయే రోజుల్లో సభలో అర్ధవంతమైన చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.