తెలంగాణ రాష్ట్రానికి ఏపీ సచివాలయ భవనాల అప్పగింత పూర్తి


హైదరాబాద్ జూన్ 20  (way2newstv.com
తెలంగాణ రాష్ట్రానికి ఏపీ సచివాలయ భవనాల అప్పగింత పూర్తయింది. బుధవారం కే బ్లాక్‌, సౌత్‌ హెచ్‌ బ్లాక్‌లు అప్పగించగా... గురువారం జే, ఎల్‌ భవనాలను అప్పగించారు. సచివాలయ భవనాల అప్పగింతను జీఏడీ అధికారులు పరిశీలించారు. ఫైళ్లు, ఇతర సామాగ్రి అప్పగింతను సిబ్బంది వీడియో రికార్డింగ్‌ చేశారు. ఇరు రాష్ట్రాల అధికారులు పరస్పరం పత్రాలు అందజేసుకున్నారు. 


తెలంగాణ రాష్ట్రానికి ఏపీ సచివాలయ భవనాల అప్పగింత పూర్తి
రాష్ట్ర విభజనలో భాగంగా హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉండటంతో ఇటీవల ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించుకుని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ భవనాలు.. తెలంగాణకు అప్పగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రక్రియ గురువారం పూర్తిచేశారు.
Previous Post Next Post