జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్‌కు కిశోర్ బాబు పంపించారు. వ్యక్తిగత కారణాలతోనే జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో రావెల వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన తరపున రావెల కిశోర్ బాబు పోటీ చేసి ఓడిపోయారు.
జనసేన పార్టీకి రావెల కిశోర్ బాబు రాజీనామా
ఈ నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీ చేసిన మేకతోటి సుచరిత గెలుపొందారు. రావెలకు కేవలం 26,371 ఓట్లు మాత్రమే వచ్చాయి. మాజీ ఐఆర్‌ఎస్ అధికారి అయిన రావెల కిశోర్‌బాబు 2014లో టీడీపీ నుంచి ప్రత్తిపాడులో పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కొన్ని కారణాల వల్ల కేబినెట్ విస్తరణ సందర్భంగా ఆయన మంత్రి పదవిని కోల్పోయారు. అప్పట్నుంచి టీడీపీకి దూరంగా ఉన్న రావెల.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. అయితే జనసేనకు రాజీనామా చేసిన రావెల కిశోర్ బాబు.. భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Tags:
Andrapradeshnews