రైతుల కోసం అద్దెకు యంత్రాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతుల కోసం అద్దెకు యంత్రాలు


ఏలూరు, జూన్ 27, (way2newstv.com
రైతుకు సాగు వ్యయం తగ్గించేందుకు ప్రభుత్వం అద్దెకు ఆధునిక యంత్రాలు అందించే కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిల్లో ఎనిమిది రకాల యంత్రాలను అందుబాటులో ఉంచింది. జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిని రైతులు వినియోగించుకుని అద్దె చెల్లించాల్సి ఉంటుంది. బయట మార్కెట్లో ధరలతో పోల్చుకుంటే అద్దె చాలా తక్కువగా ఉంటుంది. నారుపోసిన దగ్గర్నుంచి కోత కోసేవరకు ఎకరానికి మొత్తం వ్యయం రూ. 8 వేలు   అయ్యేలా ఈ యంత్రాలకు ధరలు నిర్ణయించార.జిల్లాలోని తాడేపల్లిగూడెం, చింతలపూడి, మార్టేరు, ఉండ్రాజవరంలలో ఈ అద్దెకిచ్చే కేంద్రాలను గతేడాది ఏర్పాటు చేశారు. 

రైతుల కోసం అద్దెకు యంత్రాలు

ఈ కేంద్రాల్లో రోటోవీటర్‌తో కలిపి ఉన్న రెండు ట్రాక్టర్లు, ఆరు వరసలు, నాలుగు వరసలు నాట్లు వేసే యంత్రం, ట్రేలు,  వరికోత యంత్రం, కలుపుతీసే యంత్రం, నేల చదును చేసే యూనిట్‌, విత్తనాలు నాటే యంత్రం ఇలా రూ. కోటి విలువ చేసే వాటిని ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. రైతులు వినియోగించడమే తరువాయి. కోరమాండల్‌ ఆధ్వర్యంలో ఈ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. వీటి నిర్వహణ బాధ్యత ఆ సంస్థ మార్కెటింగు ఆఫీసర్లు చూస్తున్నారు. రైతులు వీరిని సంప్రదిస్తే యంత్రాలను అద్దెకు ఇస్తారు. గత రబీసీజనులో ఈ నాలుగు ప్రాంతాల్లో పలువురు రైతులు వీటిని వినియోగించుకున్నారు.సాగు వ్యయం భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉండే  యంత్రాలను వినియోగించుకోవడం ద్వారా ఎకరంలో రూ. 8వేలు ఖర్చుతో సాగు సాగేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రస్తుతం కూలీల భారం బాగా పెరిగిపోయింది. సమయానికి కూలీలు దొరక్క కాడి వదిలేసే పరిస్థితిలో రైతులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో యంత్రాల వినియోగం అవసరం ఉంది. దానికితోడు జిల్లాలో వరిసాగు చేసేది ఎక్కువగా కౌలు రైతులే. వీళ్లు యంత్రాలను కొనుగోలు చేసుకోలేరు కాబట్టి ప్రభుత్వం ఈ కేంద్రాలను ప్రవేశపెట్టింది. ఈ యంత్రాల అద్దెలు బయట మార్కెట్లో కంటే తక్కువగా ఉండేలా జిల్లా కలెక్టరు ధరలు నిర్ణయించారు. అన్ని యంత్రాలు వినియోగించుకున్నా  ఎకరానికి రూ. 8 వేలు దాటకుండా ఉండాలనే ఉద్దేశంతో ధరలు నిర్ణయించారు