లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అత్యుత్సాహం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అత్యుత్సాహం


హైదరాబాద్‌ జూన్ 18 (way2newstv.com
లోక్‌ సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో భారత్‌ మాతాకీ జై అనాలని వారికి సూచించారు. జహీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ బీబీ పాటిల్‌ హిందీ భాషలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జై తెలంగాణ, జై జై తెలంగాణ అని నినదించారు. ఈ సమయంలో కిషన్‌ రెడ్డి కల్పించుకోని.. భారత్‌ మాతాకీ జై అను పాటిల్‌ అని సూచించారు. మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి జై భారత్‌, జై తెలంగాణ అని నినదించడంతో.. గుడ్‌ ప్రభాకర్‌ అంటూ కిషన్‌ రెడ్డి బల్లను చరిచారు. 


లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అత్యుత్సాహం
హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ప్రమాణస్వీకారం చేసేందుకు వస్తున్న సమయంలో సభలో భారత్‌ మాతాకీ జై, వందేమాతరం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఓవైసీ ప్రమాణం చేసిన అనంతరం జై భీమ్‌, అల్లాహో అక్బర్‌, జై హింద్‌ అని నినాదం చేశారు. భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ప్రమాణం చేసేందుకు వస్తుండగా.. కిషన్‌ రెడ్డి జోక్యం చేసుకొని.. మీవొళ్లు ఎవరు కొట్టకున్నా నేను కొడుతాలే అన్న అంటూ బల్లలు చరిచారు. హౌజ్‌లో ఉన్నావు కదా అని కిషన్‌ రెడ్డిని ఉద్దేశించి వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యానించగా.. అందుకే కొడుతున్న అన్నా అని బదులిచ్చారు కిషన్‌ రెడ్డి. కోమటిరెడ్డి తన ప్రమాణం అయిపోగానే భారత్‌ మాతాకీ జై అని నినదించారు. మహబూబాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోతు కవిత ప్రమాణం అయిపోగానే జై తెలంగాణ.. జై బంజారా.. అని నినాదం చేశారు. కిషన్‌ రెడ్డి కల్పించుకొని భారతమాత కూడా అను తల్లి అని కవితకు చెప్పారు.