తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తెలంగాణ సభ్యులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తెలంగాణ సభ్యులు


హైదరాబాద్‌ జూన్ 18  (way2newstv.com)
17వ లోక్‌సభలో తెలంగాణ రాష్ర్టానికి చెందిన సభ్యులు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి 9 మంది ఎంపీలు, కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ఒక ఎంపీ ప్రమాణస్వీకారం చేశారు. మొదట పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని ప్రమాణం చేయగా.. ఆ తర్వాత వరుసగా బండి సంజయ్‌ కుమార్‌, అరవింద్‌ ధర్మపురి, బీబీ పాటిల్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, 


తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తెలంగాణ సభ్యులు
అసదుద్దీన్‌ ఓవైసీ, డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి, మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, పోతుగంటిరాములు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పసునూరి దయాకర్‌, మాలోతు కవిత, నామా నాగేశ్వర్‌రావు ప్రమాణం చేశారు. వీరిలో వెంకటేశ్‌ నేతకాని, బండి సంజయ్‌ కుమార్‌, కొత్త ప్రభాకర్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, పోతుగంటి రాములు, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పసునూరి దయాకర్‌, మాలోతు కవిత, నామా నాగేశ్వర్‌రావు తెలుగు భాషలో ప్రమాణస్వీకారం చేశారు. అరవింద్‌ ధర్మపురి, రంజిత్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇంగ్లీష్‌ భాషలో ప్రమాణం చేయగా, బీబీ పాటిల్‌, అసదుద్దీన్‌ ఓవైసీ హిందీ భాషలో ప్రమాణం చేశారు.