త్వరలో కరెంట్ విమానాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

త్వరలో కరెంట్ విమానాలు


ముంబై, జూన్ 26, (way2newstv.com)
డీజిల్, పెట్రోల్ వాహనాలతో కాలుష్యం పెరిగి పర్యావరణం పాడైపోతోంది. మరి, వాటికి ప్రత్యామ్నాయం లేదా? అంటే, బాగా వినిపిస్తున్న మాట కరెంట్ బండ్లు. ఇప్పటికే కార్లు, బైకుల కంపెనీలు వాటిపై దృష్టి పెట్టాయి. కొన్ని దేశాల్లో నడుస్తున్నాయి కూడా. మరి, విమానాల పరిస్థితేంటి? ఆ దిశగానూ అడుగులు పడ్డాయి. కంపెనీలు ఎలక్ట్రిక్ విమానాలపై దృష్టి పెట్టాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఎయిర్ షోలో కంపెనీలు ఎలక్ట్రిక్ విమానాలు, వాటి మోడళ్లను ప్రదర్శించాయి. ఆ ఎయిర్ షోలో ఎలక్ట్రిక్ విమానాలతో పాటు హైబ్రిడ్ విమానాలూ కనిపించాయి. చాలా మంది కస్టమర్లు వాటిపైనే ఎక్కువ ఇష్టం చూపించారు. గత ఏడాదితో పోలిస్తే ఎలక్ట్రిక్ విమానాల తయారీ ఈ ఏడాది 50 శాతం పెరిగి 170 శాతానికి చేరిందని, ఈ ఏడాది చివరినాటికి 200శాతం వరకు చేరుతుందని  రోలండ్ బెర్జర్ అనే కన్సల్టెన్సీ అంచనా వేసింది.


త్వరలో కరెంట్  విమానాలు
పారిస్ ఎయిర్ షోలో అందరి కళ్లు ఇజ్రాయెల్ కంపెనీ ఎవియేషన్ ఎయిర్క్రాఫ్ట్పైనే పడ్డాయి. ఆ కంపెనీ ‘యలైస్’ అనే ఎలక్ట్రిక్ విమానాన్ని తయారు చేసింది. ఆ విమానాన్ని అమెరికా కంపెనీ కేప్ ఎయిర్ కొనుక్కోబోతోంది. తమకు ఫస్ట్ కస్టమర్ ఆ కంపెనీయేనని పేర్కొంది. యలైస్కు ఒక్కసారి చార్జింగ్ పెడితే, 1,050 కిలోమీటర్లు వెళుతుందని, కంపెనీల ఖర్చు 70% తగ్గిపోతుందని చెప్పింది. ఈ ఏడాదే అమెరికాలో వాటి ఉత్పత్తి ప్రారంభించామని కంపెనీ తెలిపింది. విమానాన్ని ముందుకు నడిపించేలా తోకలో ఓ పుషర్ ప్రొపెల్లర్, రెక్కల అంచుల్లో మరో రెండు ప్రొపెల్లర్లు ఉంటాయి. అన్నీ బ్యాటరీలతోనే పనిచేస్తాయి. 10 వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుంది.డిఫెన్స్ కాంట్రాక్టర్ అయిన రేథియన్ కంపెనీతో కలిసిపోతున్నట్టు యునైటెడ్ టెక్నాలజీస్ అనే కంపెనీ పారిస్ ఎయిర్ షోలో ప్రకటించింది. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ విమానానికి సంబంధించి డిజైన్ను విడుదల చేసింది. 2022 నాటికి వాటిని నడపాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. విమానమంతా పాత మోడళ్లవాటిలాగానే ఉంటుంది. ఉన్న ఒకే ఒక కొత్తదనం బ్యాటరీలు. 2 మెగావాట్ల హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ను ఇందులో వాడుతున్నారు. ఎయిర్బస్ కూడా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ విమానాలపై దృష్టి పెట్టింది. ఆ కంపెనీ కూడా 2022 నాటికి తొలి విమానాన్ని రెడీ చేయాలని భావిస్తోంది. యూరోపియన్ ఏరోస్పేస్ కంపెనీలు దాహెర్, సాఫ్రన్లతో ఒప్పందం చేసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. విమాన విడిభాగాలు, సిస్టమ్ల అనుసంధానంపై దాహెర్, ‘ఎకోపల్స్’ అనే ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్పై సాఫ్రన్ పనిచేయనున్నాయి.బ్యాటరీలు, ఏరోడైనమిక్ డిజైన్ సంగతి ఎయిర్బస్ చూసుకుంటుంది. ఎలక్ట్రిక్ మోటార్లు, ప్రొపెల్లర్లను నడిపించేలా విమానంలో టర్బోజనరేటర్లు అమర్చుతారు. అంతేకాదు, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్  సిస్టమ్స్పై రీసెర్చ్ చేసేందుకు ఎస్ఏఎస్ స్కాండినేవియన్ ఎయిర్లైన్స్తోనూ ఒప్పందం చేసుకున్నట్టు ఎయిర్బస్ ప్రకటించింది. బ్రిటన్కు చెందిన ఫేమస్ కార్ల కంపెనీ రోల్స్రాయ్స్ కూడా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్ ప్రొపల్షన్ వ్యవస్థలపై జర్మనీ కంపెనీ సీమెన్స్తో ఒప్పందం చేసుకుంది. జర్మనీ, హంగరీలో ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఇందుకోసం 180 మంది స్పెషలిస్ట్ ఇంజనీర్లను కంపెనీ ఇప్పటికే నియమించుకుంది.