ఆచూకీ దొరకని అమ్మాయి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆచూకీ దొరకని అమ్మాయి

హైద్రాబాద్, జూలై 30, (way2newstv.com)
ఈనెల 23న కిడ్నాప్ అయిన యువతి ఆచూకీ ఇంకా దొరకలేదు. యువతి కిడ్నాపర్ రవి శేఖర్ కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. ఆదివారం సాయంత్రం కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద నిందితుడి చివరి సిగ్నల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ ఆచూకీ చెప్పిన వారికి లక్ష రూపాయలు పారితోషికం ఇస్తామంటూ పోలీసులు ప్రకటించారు. యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రవి శేఖర్ కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. రవి శేఖర్‌ ‌పై గతంలో పలు కేసులు నమోదై ఉన్నాయి.  
ఆచూకీ దొరకని అమ్మాయి

పోలీసు కస్టడీ నుండి తప్పించుకుని రవిశేఖర్ తప్పించుకు తిరుగుతున్నాడు. కర్ణాటకలో సీబీఐ అధికారినంటూ కారును దొంగిలించిన రవి శేఖర్... అదే కారులో యువతిని కిడ్నాప్ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. హయత్ నగర్ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఏపీ డీజీపీ సవాంగ్ స్పందించారు. తెలంగాణ పోలీసులకు మా సహకారం ఉంటుందని చెప్పారు. కిడ్నాపర్ కోసం మా బృందాలు గాలిస్తున్నాయని.. త్వరలోనే కిడ్నాపర్‌ను పట్టుకుంటామని సవాంగ్ వెల్లడించారు. కిడ్నాప్ అయిన యువతి ఆచూకీ ఏడు రోజులైనా లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. యువతిని నిందితుడు ఏమైనా చేసి ఉంటాడోనన్న ఉత్కంఠ నెలకొంది. తమ బిడ్డను కిడ్నాపర్ భారీ నుంచి కాపాడాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.