కాపు రిజర్వేషన్లపై చర్య తీసుకోండి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాపు రిజర్వేషన్లపై చర్య తీసుకోండి

సీఎం జగన్ కు లేఖ రాసిన ముద్రగడ
కిర్లంపూడి జూలై 9, (way2newstv.com)
మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి లేఖ రాశారు. భారత దేశం లో అగ్ర కులాలలో ఉన్న పేదవారికి 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గౌరవ ప్రధాన మంత్రి మోడీ  పార్లమెంటు లో బిల్లు ఆమోదించిన విషయం మీకు తెలియనిది కాదని అయన లేఖ లో పేర్కోన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మా జాతికి ఇచ్చిన బిసి రిజర్వేషన్ అమలు చేయడం కు వంకలు పెడుతున్న సమయంలో కేంద్రం ఇచ్చిన 10 శాతం లో 5 శాతం రిజర్వేషన్ ఇస్తామని చేతులు దులుపుకున్నా సంగతి మీకు తెలియనిది కాదు. ప్రధాన మంత్రి  ఇచ్చిన రిజర్వేషన్ లో మాకు కొంత కేటాయించి గ్లోబల్ ప్రచారం విపరీతంగా చేయించి రిజర్వేషన్ ఇచ్చేసాను అని డప్పు కొట్టారు. 
కాపు రిజర్వేషన్లపై చర్య తీసుకోండి

కాని ఇప్పటికీ ఆ రిజర్వేషన్ నోచుకోలేదు. 2014 లో అధికార దాహం తీర్చు కోవడం కోసం మా జాతి పోగొట్టుకున్న బీసీ రిజర్వేషన్ అమలు చేస్తానని అనేక బహిరంగ సభలో వారి పాదయాత్ర లో వరాల వర్షం కురిపించారు. నేటికి 5 శాతం రిజర్వేషన్ అమలుకు ఎటువంటి ఆదేశాలు రాలేదని తహశీల్దార్ కార్యాలయం చెబుతున్నారు అని విన్నానని ముద్రగడ పేర్కోన్నారు. అధికారంలోకి మా జాతి వల్లే వచ్చానని అనేక సందర్భాలలో చెప్పడం జరిగేది. కాని రిజర్వేషన్ అమలు చేయడానికి శ్రీకారం చుట్టామంటే ఎక్కడలేని కోపం తెచ్చుకుని మా పై పోలీస్ జులుం చూపించేవారు. ఈ రాక్షస పాలన ఎప్పుడు అంతం అవుతుందా ఈ టిడిపి పార్టీ సముద్రగర్భంలో ఎప్పుడు కలుస్తుందా అని మా జాతి యావత్తు ఇంచుమించుగా ఎదురు చూడడం జరిగింది.  మా జాతి మీకు అధికారం కోసం సహాయం అందించారు అని భావిస్తున్నాను. మా జాతి సహకారం మీరు పొందారని పూర్తిగా భావిస్తే అసంపూర్తిగా ఉండిపోయిన మా జాతి రిజర్వేషన్ కార్యక్రమం పూర్తి చేయించండని కోరారు.  మా జాతి వారు మా కులానికి చెందిన మరొక పార్టీ ని పక్కన పెట్టి మా జాతి ఓట్లు కొన్ని చోట్ల తప్ప మిగిలిన అన్ని చోట్ల మీకు వేసి పట్టం కట్టారని భావిస్తున్నాను. దయచేసి నేను రాసిన విషయాలు వాస్తవం అని మీరు భావిస్తే నే మా జాతి రిజర్వేషన్ కార్యక్రమం పూర్తి చేయించాలని కోరుచున్నాను. త్వరగా పూర్తి చేయడం వలన చదువుకునే పిల్లలకు, చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి మంచి జరుగుతుందని కోరుకుంటున్నానని  ముద్రగడ ఆ లేఖలో పేర్కోన్నారు.