భారీగా వరద నీరు

జూరాల ప్రాజెక్టుకు వరదనీరు
మహబూబ్ నగర్, జూలై 18, (way2newstv.com)
జురాల ప్రాజెక్టు రెండు రోజుల్లో జల కళను సంతరించుకోనుంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులలో సామర్థానికి మించి భారీగావరదనీరు చేరుతుండటంతో దిగువప్రాంతామైన మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరదనీరు చేరనుంది. కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి డ్యాంలోకి వర ద ఉధృతిపెరిగింది. ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతుండటంతో అక్కడి ప్రభుత్వం ఆల్మట్టి నుంచి దిగువకు 33 వేల 128 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఆల్మట్టి డ్యాంలో ఇన్‌ఫ్లో లక్షా 11వేల 56 క్యూసెక్కుల నీరు చేరుతుండగా అవుట్ ఫ్లో 33 వేల 128 క్యూసెక్కులు ఉంది.డ్యాంలో ప్రస్తుత నీటి నిల్వ 99.39 టిఎంసిలకు చేరింది. ఆల్మట్టినుంచి నారాయణపూర్‌కు నీరుచేరుతుండటంతో నారాయణపూర్ డ్యాంలో ఇప్పటికే నిల్వ ఉన్న 26 టిఎంసి నీటికి అదనంగా ఆల్మట్టి నీరు చేరుతుంది. 
భారీగా వరద నీరు

అయితే నారాయణపూర్ ప్రాజెక్టులోకి మరో 11 టిఎంసిల నీరు చేరితే డ్యాంపూర్తిస్థాయికి చేరుకుంటుం ది. ప్రస్తుతం నారాయణపూర్ దగ్గర ఇన్‌ఫ్లో 42వేల నాలుగు వందల 53 క్యూసెక్కులు ఉండగా ఔట్ ప్లో 16 వందల 29 క్యూసెక్కులుగా నమోదు అయింది. నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి వస్తున్న ఔట్ ఫ్లో నీటితో దిగువన ఉండే కర్ణాటకప్రాజెక్టుల్లోకి తొలుత పూర్తి స్థాయిలో నీరు చేరుకుంటింది. ఆతర్వాత కర్ణాటకలో వచ్చిన నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఈ నీరు తొలుత జూరాల ప్రాజెక్టులోకి చేరుకోనుంది.ఆల్మట్టి పూర్తి సామర్థానికి చేరుకోవడంతో పాటు నారాయణపూర్ ప్రాజెక్టుతో పాటు కర్ణాటకలోని దిగువ ప్రాజెక్టులన్నీ దాదాపుగా పూర్తి సామర్థానికి చేరుకుంటున్నాయి. ఆతర్వాత వరదనీరంతా దిగువకు ప్రయాణించి జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటుంది. తెలంగాణలో కృష్ణానది ప్రవేశించగానే మొదటి ప్రాజెక్టు జూరాల ఉండటంతో కర్ణాటక వరదనీరు జూరాలలోకి చేరుకుంటుంది. మరో మూడురోజుల్లో నారాయణపూర్ ప్రాజెక్టునుంచి జూరాలకు భారిగా వరదనీరు వస్తుందని అధికారులు అంచనావేస్తున్నారు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలో నిర్మించిన బహుళార్థక ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు నుంచి కుడికాల్వద్వారా గద్వాల, అలంపూర్ లోకి నీరు చేరుకుని ప్రస్తుత పంటలకాలంలో 37వేల 700 ఎకరాలకు, ఎడమకాల్వనుంచి ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ లోని 64 వేల 500 ఎకరాలకు సాగునీరు అందనున్నాయనే ఆశాభావం అధికారుల్లో వయక్తంమవుతుంది. 24 మెగావాట్ల జూరావ జవిద్యుత్ కెంద్రానికి నీటి కొరత తీరుతుందని తెలుస్తుంది.
Previous Post Next Post