దివిసీమలొ గాలి, వాన భీభత్సం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దివిసీమలొ గాలి, వాన భీభత్సం

విజయవాడ, జూలై 15, (way2newstv.com)
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం దివి సీమలో సోమవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో వానా గాలి బీభత్సం సృష్టించింది. పెద్ద ఎత్తున ఈదురు గాలులు, భారీ వర్షం కురవడంతో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. గాలివానకు ముందే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. 
దివిసీమలొ గాలి, వాన భీభత్సం

భారీ వర్షానికి అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నేల కూలగా బందలాయిచెరువు ఎస్సీ కాలనీలో మూడు చోట్ల భారీ వృక్షాలు పడి విద్యుత్ తీగలు తెగి పోయాయి. ఒకచోట భారీ వృక్షం 2 బడ్డీ కొట్లుపై పడటంతో ధ్వంసమయ్యాయి. రాక పోకలు స్థంభించడంతో స్థానికులు చెట్లు నరకి అడ్డు తొలగిస్థున్నారు. అవనిగడ్డ లోని పలు ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు నీటమునిగాయి అవనిగడ్డ తాసిల్దార్ ఆఫీస్ నందు విద్యుత్ వైరు తెగి నీటిలో వేలాడుతుంది తెల్లవారుజామున ఈ ఘటన జరగడం తో పెను ప్రమాదం తప్పింది. పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగడం వలన విద్యుత్ సిబ్బంది యుద్ద ప్రతిపాదికపై మరమ్మతులు చేపట్టారు.