చంద్రబాబుపై జగన్ హాట్ కామెంట్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రబాబుపై జగన్ హాట్ కామెంట్స్

విజయవాడ, జూలై 11(way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజే అధికార వైఎస్‌ఆర్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం కాస్త ఘాటుగానే సాగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశంపై ప్రస్తావన వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు చంద్రబాబు హయాంలో నిర్మిస్తుంటే టీడీపీ వాళ్లు గాడిదలు కాస్తున్నారా అంటూ సీఎం జగన్ అన్నారు. దీంతో ఆ టీడీపీ ఆందోళనకు దిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వెళ్లడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. దీనికి జగన్ సమాధానమిస్తూ కాస్త ఘాటుగానే మాట్లాడారు.
చంద్రబాబుపై జగన్ హాట్ కామెంట్స్

హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని అక్కడకు వచ్చిన కేసీఆర్‌తో పొత్తుకోసం ప్రయత్నించిన చంద్రబాబు ఇప్పుడు అదే టీఆర్‌ఎస్‌ను శత్రువులా చూస్తున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యాక సీఎం హోదాలో ప్రారంభోత్సవానికి వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాలతో మంచిగా ఉండాలనే తాను వెళ్లానన్నారు. రెండు రాష్ట్రాలు సఖ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తున్నానన్నారు. గోదావరి నీటిని ఎలాగైనా సరే కృష్ణాకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉంటే, ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌ను తిట్టింది జగన్ కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘కాళేశ్వరం నుంచి భవిష్యత్తులో నీళ్లు ఇచ్చేది లేదని కేసీఆర్ అంటే ఏం చేస్తారు. భవిష్యత్తు తరాల జీవితాలను తాకట్టు పెట్టే అధికారం సీఎంకు లేదు’ అని చంద్రబాబు అన్నారు. నీటి విషయాలు చాలా సున్నితమైనవని జగన్ అన్నారు. గోదావరి నుంచి కృష్ణాకు నీటిని తరలించే అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. తొందరపాటు నిర్ణయాలు తగవన్నారు. దీనికి జగన్ స్పందిస్తూ.. ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నప్పుడు కూడా చంద్రబాబే సీఎంగా ఉన్నారని, అప్పుడేం చేశారని సీఎం జగన్ ప్రశ్నించారు. ఇంతటి దారుణమైన ప్రతిపక్షనేత ప్రపంచంలోనే ఉండదన్నారు. నీళ్లువస్తుంటే సంతోషించాల్సింది పోయి విమర్శిస్తారా అని మండిపడ్డారు. మరోవైపు, చంద్రబాబు మాట్లాడుతూ తన రాజకీయ అనుభవం అంత వయసు జగన్‌కు లేదన్నారు. అలాంటి వ్యక్తి ఇరిగేషన్‌పై ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదన్నారు.