ఖమ్మం, జూలై 5 (way2newstv.com):
జిల్లాలో మూడేళ్లుగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల ఊసే లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆపరేషన్లు జరగకపోవడంతో బాలింతలు పక్క రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తోంది. ప్రత్యేక కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సా శిబిరాలు పూర్తిగా కనుమరుగవ్వడంతో బాలింతలు వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు.
ఇక్కడ కుదరవ్... (ఖమ్మం)
జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ ఆసుపత్రులు మినహా మరెక్కడా ఇవి జరగకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. సామాజిక ఆసుపత్రుల్లో (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) సైతం ఈ ఆపరేషన్లు జరగడం లేదు. జిల్లాలో సగటున ఒక్కో ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో ఏడాదికి 20 ప్రసవాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా ఉన్న 104 ఆరోగ్య ఉపకేంద్రాల్లో 2 వేల మంది గర్భిణులు ప్రసవిస్తున్నారు. వీరందరూ పిల్లలు పుట్టకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలంటేఏపీకి వెళ్తున్న బాలింతలు.. పిల్లలు పుట్టకుండా కు.ని శస్త్ర చికిత్సల కోసం బాలింతలు అశ్వారావుపేట, దమ్మపేట మండలాల వారు ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వెళ్లాల్సి వస్తోంది. భద్రాచలం వెళ్లాలంటే దూరాభారం. దీంతో తక్కువ దూరం అయిన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి, లేదా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. గతంలో శస్త్ర చికిత్సలు చేయించుకున్న మహిళలకు నగదు ప్రోత్సాహకాలు అందజేసేవారు. మూడేళ్లుగా అసలు వీటి ఊసే లేకపోవడంతో ఇక ప్రోత్సాహకాలెక్కడుంటాయి.గతంలో ప్రత్యేక కు.ని. శస్త్రచికిత్స శిబిరాల ద్వారా వేసక్టమీ, ట్యూబెక్టమీ, ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేసేవారు. మూడేళ్లుగా అసలు ప్రత్యేక శిబిరాల జాడేలేదు.
-
Tags:
telangananews