మెగా టోర్నికి ఇండియన్ టీమ్


ముంబై, మే 22, (way2newstv.com)
ఐసీసీ మెన్స్‌ వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు భారత జట్టు ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇంగ్లాండ్‌ బయలుదేరి వెళ్లింది. 15 మంది సభ్యుల బృందంతో పాటు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, జట్టు సహాయ సిబ్బంది ఇంగ్లాండ్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఆటగాళ్లందరూ ప్రత్యేక డ్రెస్‌కోడ్‌లో మెరిసిపోయారు.

మెగా టోర్నికి  ఇండియన్ టీమ్

విమానం ఎక్కేందుకు సమయం ఉండటంతో కొంత‌మంది ఆట‌గాళ్లు స‌ర‌దాగా పబ్‌జీ గేమ్‌ను ఆడారు. మహేంద్రసింగ్‌ ధోనీ, చాహల్‌, మ‌హ్మ‌ద్‌ ష‌మీ, భువనేశ్వర్‌ ఇలా ఆటగాళ్లంతా సరదాగా ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడారు. ఆటగాళ్లందరూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ వేదికగా ఈనెల 30న మెగాటోర్నీ ఆరంభంకానుంది. అంతకుముందు మే 25న న్యూజిలాండ్‌తో తొలి వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ తలపడనుండగా.. మే 28న బంగ్లాదేశ్‌తో రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత్‌ జట్టు జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా సౌతాఫ్రికాతో పోరుతో టోర్నీని మొదలుపెట్టనుంది. 
Previous Post Next Post