వర్షాలు కురువాలని మహావరుణ యాగం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వర్షాలు కురువాలని మహావరుణ యాగం

తిరుపతి వేద పండితుల మధ్య శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు
ఎమ్మిగనూరు జూలై 11 (way2newstv.com
రాష్ట్రంలో వర్షాలు పడక రైతులు,ప్రజలు ఆందోళనకు గురౌతున్నారని దీంతో వర్షాలు కురువాలని మహావరుణ యాగాన్ని చేపడుతున్నామని పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ గౌరవ అధ్యక్షులు మౌనిక వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
వర్షాలు కురువాలని  మహావరుణ యాగం

గురువారం ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీఆంజనేయస్వామి దేవాలయంలో తిరుపతి వేదపండితులు,రుత్వికులు మధ్య భక్తి శ్రద్ధలతో వర్షం కోసం అగ్ని హోమం వరుణ యాగం ఘనంగా నిర్వహించారు.అంతకంటే ముందు శ్రీమహాగణపతి పూజ, గోపూజ,యాగశాల ప్రవేశం,పుణ్యాహవాచనం లాంటి పూజలు జరిపారు.ఈ కార్యక్రమంలో పెస్టిసైడ్స్ మరియు ఫర్టిలైజర్స్  నాయకులు నాగరాజు, చంద్రశేఖర్, వేణుగోపాల్ రెడ్డి,గజేంద్రరెడ్డి లతో పాటు వారి సతీమణులు,ఆలయ అర్చకులు,ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.