కేసీఆర్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ శాసనసభలో ప్రశంసలు

అమరావతి జూలై 11  (way2newstv.com
సీఎం కేసీఆర్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీ శాసనసభలో ప్రశంసలు కురిపించారు. ఇరు రాష్ర్టాల మధ్య సఖ్యతకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను జగన్ కొనియాడారు. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం ఎంతో గొప్పదన్నారు. 
కేసీఆర్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ శాసనసభలో ప్రశంసలు

సాగునీటి రంగంలో ఏపీకి సహకరిస్తున్న వ్యక్తిని విమర్శిస్తున్న చంద్రబాబు లాంటి ప్రతిపక్షనేత బహుశా ప్రపంచంలోనే మరొకరు ఉండరని జగన్ విమర్శించారు. తెలంగాణ నుంచి గోదావరి నీళ్లను తీసుకుంటున్నాం. రెండు రాష్ర్టాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించాలి. ఏపీ విన్నపాలను తెలంగాణ సీఎం కేసీఆర్ గౌరవించారు. సీఎం కేసీఆర్‌ను మెచ్చుకోవాల్సిందిపోయి విమర్శించడం సరికాదు. రాష్ర్టాల మధ్య సఖ్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యం.. అని జగన్ అన్నారు.
Previous Post Next Post